Dil Raju As spl Guest for Dadasaheb Phalke School of Film Studies

 దిల్ రాజు ముఖ్య అతిథిగా

దాదా సాహెబ్ ఫాల్కే 

స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్

6 వ స్నాతకోత్సవం!!



ప్రముఖ దర్శకులు "అంకురం" ఉమామహేశ్వరరావు సారథ్యంలో అందరికీ అందుబాటులో... అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" ఆరవ స్నాతకోత్సవం జూన్ 18, ఆదివారం జరుపుకుంటోంది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ... సినిమా రంగానికి అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమేష్ ప్రసాద్ విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అని "దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి తెలిపారు!!

Post a Comment

Previous Post Next Post