Home » » Saami ranga Song Launched From Changure Bangaru Raja

Saami ranga Song Launched From Changure Bangaru Raja

 ఆర్ టీ టీమ్‌వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్, సతీష్ వర్మ 'ఛాంగురే బంగారురాజా' నుంచి సామిరంగ పాట విడుదల



మాస్ మహారాజా రవితేజ యువ, ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ తో కంటెంట్-రిచ్ సినిమాలను తీయడానికి ఆర్టీ టీమ్‌వర్క్స్ ని స్థాపించారు. ఆర్ టీ టీమ్‌వర్క్స్ లేటెస్ట్  ప్రొడక్షన్ “ఛాంగురే బంగారురాజా”. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి చిత్రాన్ని  రవితేజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యుసర్స్.


‘C/O కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ కథానాయిక. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగల్ సామిరంగా పాటనివిడుదల చేశారు మేకర్స్. కృష్ణ సౌరభ్ ఈ పాటని క్యాచి ట్యూబ్ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్ పాడిన ఈ పాటకు కృష్ణ చైతన్య ఆకట్టుకునే సాహిత్యం అందించారు.  ఈ పాటలో కార్తీక్ రత్నం డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.  

 

ఈ చిత్రం కోసం సతీష్ వర్మ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్రెష్ క్రైమ్ జానర్‌ని ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్.


ఛాంగురే బంగారురాజా విడుదలకు సిద్ధమవుతోంది.


నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ తదితరులు.


సాంకేతిక విభాగం:

నిర్మాత: రవితేజ

బ్యానర్: ఆర్ టీ టీమ్‌వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌

రచన, దర్శకత్వం: సతీష్ వర్మ

క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: శ్వేత కాకర్లపూడి,  షాలిని నంబు

సంగీతం: కృష్ణ సౌరభ్

డీవోపీ: సుందర్ ఎన్ సి

ఎడిటర్: కార్తీక్ వున్నవా

ఆర్ట్: నార్ని శ్రీనివాస్

డైలాగ్స్: జనార్దన్ పసుమర్తి

పీఆర్వో : వంశీ-శేఖర్



Share this article :