Home » » Director Gunasekhar Interview About Shakuntalam

Director Gunasekhar Interview About Shakuntalam

 ‘శాకుంతలం’లో సమంత చేసిన శకుంతల పాత్ర నేటితరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది:  గుణ శేఖ‌ర్‌ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.  కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందించారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ  పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు.


3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా  తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. . ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ‘శాకుంతలం’ సినిమా గురించి పాత్రికేయులతో ప్రత్యేకంగా మాట్లాడారు, ఆ ఇంటర్వ్యూ విశేషాలు..


 మ‌న‌ల్ని ఎగ్జ‌యిట్ చేసే క‌థ‌ల‌ను మ‌నం జ‌నాల‌కు ఇంకా ఎగ్జ‌యిటింగ్‌గా చెప్పొచ్చున‌నే ఆలోచ‌న‌తో ముందు హిర‌ణ్య క‌శ్య‌ప స్క్రిప్ట్ మీద 5 ఏళ్లు వ‌ర్క్ చేశాను. అందులో 2 సంవత్స‌రాలు స్క్రిప్ట్ మీద‌.. 3 సంవ‌త్స‌రాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ మీద వ‌ర్క్ చేశాను. అంతా పని పూర్త‌య్యింది. ఇక సినిమాను తెర‌కెక్కించ‌టం మాత్రం మిగిలింద‌నుకున్న త‌రుణంలో కోవిడ్ వ‌చ్చింది. అదే స‌మ‌యంలో మాతో ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మ‌రో వ‌ర్క్‌పై ఫోక‌స్ పెట్టింది. దాంతో ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్ పెట్టాం.

లాక్డ్ డౌన్ స‌మ‌యంలో కాంపేక్ట్‌గా ఓ ల‌వ్‌స్టోరి చేద్దామ‌నిపించింది. ల‌వ్ స్టోరి అన్న‌ప్పుడు కొన్ని పురాణాలు, ఇతిహాసాలు రెఫ‌ర్ చేశాను. ఆ క్ర‌మంలో న‌న్ను అభిజ్ఞాన శాకుంత‌లం న‌న్నెంతో ఎట్రాక్ట్ చేసింది. దాన్ని సోష‌లైజ్ చేయ‌ట‌మెందుకు? అలాగే తీస్తే బెట‌ర్ క‌దా అని మొద‌లు పెట్టాను.

 శాకుంత‌లం సినిమాలో కేవ‌లం ప్రేమ‌తో పాటు మంచి వేల్యూస్ ఉన్నాయి. సాధార‌ణంగా శ‌కుంత‌ల అన‌గానే శృంగార శ‌కుంత‌ల‌ను గుర్తుకొస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అలానే పొట్రేట్ చేశారు. కానీ ఆమెలో అంత‌ర్గ‌తంగా చాలా శ‌క్తి ఉంటుంది. దాని గురించి కాళిదాసుగారు అభిజ్ఞాన శ‌కుంత‌లంలో ప్ర‌స్తావించారు. మ‌హాభార‌తంలోని ఆది ప‌ర్వంలో వ‌చ్చిన శ‌కుంత‌ల, దుష్యంత‌ల క‌థ‌ను బేస్ చేసుకునే 7 న‌టీన‌టుల నాట‌కంలాగా అభిజ్ఞాన శాకుంత‌లంను రాశారు. ఇది విదేశాల్లో చాలా ఫేమ‌స్‌. దీనిపై మ్యూజిక్ షోస్ చేసేవాళ్లు. దాంట్లో కూడా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను గొప్ప‌గా చూపించారు. దాని కోసం కాళిదాసుగారు మ‌హాభార‌తాన్ని త‌న‌దైన పంథాలో ఎలివేట్ చేశారు. ఆయ‌న కోణంలో పాత్ర‌ల‌ను మ‌లిచిన తీరు నాకు బాగా న‌చ్చింది. ఇప్ప‌టి యూత్ దానికి క‌నెక్ట్ అవుతార‌నిపించింది.

 స‌మంత మంచి న‌టి కాబ‌ట్టి.. శ‌కుంత‌ల పాత్ర‌లో రొమాంటిక్ యాంగిల్‌ను నేను సెకండ్రీ చేశాను. పెర్ఫామ‌ర్‌గా క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాను. త‌న ఆత్మాభిమానం కోసం అప్ప‌ట్లో శ‌కుంత‌ల‌.. రాజు, రాజ్యాల‌ను లెక్క చేయ‌లేదు. ఫైట్ చేసి నిల‌బ‌డింది. పెళ్లి కాకుండా త‌ల్లి కావ‌టం అనేది అప్ప‌ట్లో పెద్ద నేరం. అలాంటి ప‌రిస్థితుల‌ను ఆమె ఎలా ఎదురొడ్డి నిల‌బ‌డింద‌నేది క‌థాంశం. ఇప్పుడు మ‌హిళ‌లు అన్నీ రంగాల్లో ఫైట్ చేస్తూ త‌మ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అ్ందుక‌నే నేటిత‌రం అమ్మాయిల‌కు అప్ప‌టి శ‌కుంత‌ల క‌నెక్ట్ అవుతుంది.

 జంతువుల‌ను యానిమేష‌న్‌లో క్రియేట్ చేయ‌టం అనేది చాలా క‌ష్టం. డ‌బ్బుతో పాటు స‌మ‌యాన్ని కూడా వెచ్చించాలి. ఇప్ప‌టి కాలమాన పరిస్థితుల‌తో కంపేర్ చేసుకుంటే, 15-20 ఏళ్ల క్రితం ఇదే జంతువుల‌తో అద్భుతంగా సినిమాను తీయ‌గ‌లిగేవాళ్లం. అది ఇప్పుడు మిస్సింగ్‌. అలాగే అడ‌వులు విష‌యంలోనూ అలాగే ఉంది. శాకుంత‌లంలో కొంత భాగాన్ని హిమాయాల్లో చిత్రీక‌రించాల‌ని కాశ్మీర్ వెళ్లాం. ఎక్క‌డ కెమెరా పెట్టినా సివిలైజేష‌న్ కింద‌ ఎల‌క్ట్రిక‌ల్ పోల్స్ క‌నిపిస్తున్నాయి. అప్ప‌టి శాకుంత‌లం సినిమా కోసం కాశ్మీర్‌లో చిత్రీక‌రించాలంటే చాలా లోప‌ల‌కు వెళ్లిపోవాల్సి వ‌స్తుంది. అక్క‌డ బ్యాక్ గ్రౌండ్ ప్లేట్స్ తీసుకుని వాడుకోవాల్సి వ‌చ్చింది.

శ‌కుంత‌ల‌కు జంతువులే స్నేహితులు. కాబ‌ట్టిజంతువుల‌ను క్యారెక్ట‌ర్స్‌గా చిత్రీక‌రించాలి. కాబ‌ట్టి నేను సీజీమీద ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆడియెన్స్ చాలా అడ్వాన్డ్స్‌గా ఉన్నారు. కాబ‌ట్టి వాటిని స్క్రీన్‌పూ చూపించాలంటే మంచి బ‌డ్జెట్ పెట్టాలి. లేదా తీయ‌టం మానేయాలి. సీజీ వ‌ర్క్ కోసం 14 స్టూడియోస్‌తో క‌లిసి ప‌ని చేశాం.

 స్పెష‌ల్ షోస్ క్యాన్సిల్ అయ్యాయంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. ఈరోజు కూడా ఢిల్లీలో స్పెష‌ల్ షో వేస్తున్నారు. మ‌నం సినిమాను మెయిన్‌గా త్రీడీలో చూపించాల‌నే తీశాం. దిల్ రాజుగారు కూడా అంద‌రికీ త్రీడీలోనే చూపించాల‌ని అనుకున్నారు. త్రీడీని రెగ్యుల‌ర్ స్క్రీన్స్‌లో చూడ‌లేమ‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దాన్ని బ‌య‌టే థియేట‌ర్‌లోనే చూడాలి. అందువ‌ల్ల రీసెంట్‌గా ప్ర‌సాద్ ఐ మ్యాక్స్‌లో నేను ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. చిన్న చిన్న టెక్నిక‌ల్ ఎర్ర‌ర్స్‌ను ఐడింటిఫై చేశాను. ఇప్పుడు దాన్ని క‌రెక్ట్ చేస్తున్నాను. ఈరోజు మ‌ధ్యాహ్నం క‌రెక్ష‌న్స్ చేసేసి అప్‌లోడ్ చేస్తున్నాం.

 ప్రీమియ‌ర్స్‌కి అంతా బ‌య‌టి వాళ్లు వ‌చ్చారు. వారి నుంచి కంటెంట్ మీద సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

దుష్యంతుడి క్యారెక్ట‌ర్‌లో షేడ్స్ ఉంటాయి. కాబ‌ట్టి దేవ్ మోహ‌న్ చేసిన పాత్ర‌ను చేయ‌టానికి మ‌న హీరోలు అంగీక‌రించ‌రు. అడిగి లేద‌నిపించుకోవ‌టం ఇష్టం లేక‌.. మ‌న తెలుగు హీరోల‌ను అడ‌గ‌లేదు. ఒక‌వేళ దేవ్ మోహ‌న్ దొరక్కుండా ఉండుంటే మ‌న హీరోల‌ను అడిగి ఉండేవాడినేమో. అయితే దేవ్ మోహ‌న్ దొర‌క‌గానే, ఇంకేవ‌రినీ అడ‌గ‌లేదు. త‌ను కూడా ఎంత స‌మ‌య‌మైనా ఈ క్యారెక్ట‌ర్ కోసం కేటాయిస్తాన‌ని అన్నాడు. మ‌రో సినిమా కూడా చేయ‌న‌ని అన్నాడు. అత‌న్ని బాగా ట్రైన్ చేయించుకుని దుష్యంతుడి పాత్ర‌ను చేయించుకున్నాను.

స‌మంత ఇంత‌కు ముందు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. అందులో అల్ట్రామోడ్ర‌న్ క్యారెక్ట‌ర్స్ కూడా ఉన్నాయి. ఆమెను క్లాసిక‌ల్ బాడీ లాంగ్వేజ్‌తో చూపించాలి. అందుక‌నే క్లాసిక‌ల్ స్టాండ‌ర్డ్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ నేటి త‌రం వాళ్ల‌కి కూడా శ‌కుంత‌ల పాత్ర క‌నెక్ట్ అయ్యేలా ఓ మీట‌ర్ త‌యారు చేసుకుంది. ఆ ప్రాసెస్‌లో అరుణ బిక్షుగారు క‌లిశారు. నేను, అరుణ బిక్ష‌గారు, స‌మంతగారు క‌లిసి మాట్లాడుకుని పాత్ర‌ను డిజైన్ చేశాం. స‌మంత కొత్త హీరోయిన్‌లా అరుణ బిక్షుగారి ఇంటికి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని మ‌రీ న‌టించింది.

శాకుంత‌లంలో దుర్వాస మ‌హా మునిగా మోహ‌న్‌బాబు న‌టించారు. ఆయ‌న త‌ప్ప మ‌రొక‌రు చేస్తే బాగోద‌ని నేను బాగా ఆలోచించాను. ఎందుకంటే అంత‌కు ముందు రుద్ర‌మ‌దేవి సినిమాలో ఓ పాత్ర కోసం ఆయ‌న్ని అప్రోచ్ అయితే ఆయ‌న రిజెక్ట్ చేశారు. దాంతో నేను ఆయ‌న చేయ‌క‌పోతే ప్రాజెక్ట్ గురించే ఆలోచ‌న‌లో ప‌డేంత‌గా ఆలోచ‌న‌లో ప‌డ్డాను. వెళ్లి ఆయ‌న్ని క‌లిశాను. క‌థ విని ఆయ‌న ఒప్పుకోక‌పోతే అల్ట‌ర్‌నేటివ్ ఎవ‌రో కూడా ఆయ‌నే చెప్పాల‌ని అన్నాను. అయితే ఆయ‌న విని నేనే చేస్తాన‌ని అన్నారు. అలా ఆయ‌న ఈ సినిమా భాగ‌మ‌య్యారు.

ఈ సినిమా కోసం ఏడాది పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశాను. ఐదు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణంతా కంప్లీట్ చేసేశాను. అక్క‌డి నుంచి ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మీద కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేశాను. దేనికి ఎంత స‌మ‌యం కేటాయించాలో అంత టైమ్ కేటాయించాను.

 శ‌కుంత‌ల పాత్ర‌లో రెండు షేడ్స్ ఉంటాయి. ఒక‌టి శృంగార శకుంత‌ల‌,  రెండోది ఆత్మాభిమానం గ‌ల శ‌కుంత‌ల‌. నేను స‌మంత హీరోయిన్ అనుకోగానే ఆత్మాభిమానం గ‌ల శ‌కుంత‌ల అనే షేడ్ మీద ఫోకస్ చేశాను. అలాగ‌ని శృంగార శ‌కుంత‌ల షేడ్‌ను నేనేమీ త‌క్కువ చేయ‌లేదు. రేపు స్క్రీన్‌పై సినిమా చూస్తే ఆమె క్యూట్‌నెస్ తెలుస్తుంది. శృంగార‌మంటే ప్రొవ‌కేటివ్ కాదు.. అమాక‌త్వంతో కూడుకున్న‌ది. అదే కాళిదాసుగారు చెప్పింది. అందుకు కార‌ణం ఆమె అడ‌వుల్లో ఆశ్ర‌మ వాతావ‌ర‌ణంలో పెరిగింది. కాబ‌ట్టి దాన్ని నేను పొట్రేట్ చేశాను.

మ‌ణిశ‌ర్మ‌గారు ఎప్ప‌టి నుంచి పీరియాడిక్ సినిమా చేయాల‌నుకుంటున్నారు. అప్పుడు నేను శాకుంత‌లం కోసం అప్రోచ్ అయ్యాను. ఆయ‌న త‌న‌దైన స్టైల్లో అద్భుత‌మైన సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.Share this article :