STR 48 Announcement

 ఉలగనాయగన్ కమల్ హాసన్, స్టార్ హీరో శింబు, దేశింగ్ పెరియసామి, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ #STR48 అనౌన్స్ మెంట్




ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, స్టార్ హీరో శింబు కథానాయకుడిగా #STR48ని అనౌన్స్ చేసింది. కమల్ హాసన్ ఆర్. మహేంద్రన్ నిర్మించనున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం దేశింగ్ పెరియసామి. కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్ విజయం తర్వాత పెరియసామి మరో అద్భుతమైన కథతో వస్తున్నారు.



ఇది రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్56వ ప్రొడక్షన్. ఉలగనాయగన్ కమల్ హాసన్ కథానాయకుడిగా, మణిరత్నం దర్శకత్వంలో KH234, అలాగే రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన శివకార్తికేయన్, సాయి పల్లవి నటిస్తున్న సోనీ పిక్చర్స్‌తో పాటు RKFI 51తో సహా అద్భుతమైన చిత్రాలు వరుసలో వున్నాయి.



రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ గత 40 సంవత్సరాలుగా ఆలోచనరేకెత్తించే, వినోదభరితమైన,  అత్యంత ప్రశంసలు పొందిన చలనచిత్రాలను అందించింది. ఇప్పుడు #STR48 మరో అద్భుత చిత్రంగా వస్తోంది.



యూనివర్శల్ స్టార్, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ.. శ్రేష్టమైన చిత్రాలని అందించడం రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లక్ష్యం. గత 40 ఏళ్లుగా మా సామర్థ్యాల మేరకు దీన్ని చేస్తున్నాం. మనలాంటి లక్ష్యాలను సాధించే వ్యక్తుల కోసం మేము ఒక వేదికను అందించాలనుకుంటున్నాము. పరిశ్రమలో విజయం సాధించడం మాకు చాలా ముఖ్యం. శింబు, దేశింగ్ పెరియసామి టీం కి ఆల్ ది బెస్ట్’’ చెప్పారు



హీరో శింబు మాట్లాడుతూ.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ సర్ ప్రొడక్షన్‌లో పనిచేయడం గొప్ప గౌరవం. దర్శకుడు దేశింగ్ పెరియసామి, అతని స్క్రిప్ట్‌పై నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది’ అన్నారు.



దర్శకుడు దేశింగ్ పెరియసామి మాట్లాడుతూ..ఈ చిత్రంలో భాగమైనందుకు, ఈ విలక్షణమైన  కథను పంచుకునే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ నాకు ఎంతో ప్రత్యేకం. లెజెండరీ కమల్ సర్  RKFI బ్యానర్ నిర్మాణంలో పని చేయడం గొప్ప గౌరవం.  టాలెంట్‌కి పవర్‌హౌస్‌ లాంటి శింబుగారితో పని చేయడం ఆనందంగా వుంది.  

ఈ ప్రాజెక్ట్ లో కీలకపాత్ర పోషించినందుకు శ్రీ మహేంద్రన్ సర్‌కి చాలా కృతజ్ఞతలు’’ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post