Home » » Pan India Dasara Team Pressmeet

Pan India Dasara Team Pressmeet

 దేశమంతా తెలుగు సినిమా దసరా  కోసం ఎదురు చూస్తుందని ఇండియా టూర్  ప్రచారంలో  అర్థమయింది : నేచురల్ స్టార్ నానినాకు నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా.నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో శనివారం  ప్రెస్ మీట్  హైదరాబాద్‌ లోని త్రిడెంట్‌ హోటల్‌ లో ఘనంగా జరిగింది.


ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, వి కేర్‌ అనే ఆర్గనైజేషన్‌ కు నాకు రిలేషన్‌ వుంది. పిల్లలు డిజైన్‌ వేసి నాకు షర్ట్‌ ఇచ్చారు. వారే ఈ వేడుకకు చీఫ్‌ గెస్ట్‌ లు.  నేను చిన్నతనంలో డబ్బులు దాచుకుని బట్టలు కొనుక్కున్నా. ఇప్పుడు లైఫ్‌ లో సెటిల్‌ అయినా ఈ పిల్లలు బొమ్మలువేసి ఇచ్చిన షర్ట్‌ నాకు చాలా స్పెషల్‌ అన్నారు.

ఇక సినిమా గురించి చెపుతూ, సతీష్‌ మాస్టర్‌ దసరాతో బిజీ అయిపోతారు. సుధాకర్‌ గారు సినిమా ఆరంభం నుంచి సపోర్ట్‌ చేశారు. నిర్మాతకు అసలైన రివార్డ్‌ లు, అవార్డు లు మొదలవుతాయని భావిస్తున్నాను. దీక్షిత్‌ లాంటి మంచి నటుడు దొరికాడు. ఇందులో తను మంచి పాత్ర చేశాడు. శ్రీకాంత్‌ గొప్ప దర్శకుడు. కీర్తి పెర్‌ఫార్మెన్స్‌ అద్బతంగా చేసింది. ఆమె నటన గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ సినిమాలో మాకంటే ఎక్కువ కష్టపడిన మా గ్యాంగ్‌ కు థ్యాంక్స్‌.  మార్చి 30 తర్వాత మిమ్మల్ని బాగా గుర్తు పెట్టుకున్నారు అని తెలిపారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ, నేను లోకల్‌ తర్వాత నానిగారితో చేయడం ఆనందంగా వుంది. నిర్మాత సుధాకర్‌గారికి థ్యాంక్స్‌. ఝాన్సీగారికి థ్యాంక్స్‌. దీక్షిత్‌ ఇది నీకు ప్రారంభమే. ఇంకా చాలా సినిమాలు చేయాలి. నేను సినిమాలో పెద్దగా ఫైట్స్‌ చేయలేదు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సంగీతం బాగా కుదిరింది. సత్యంగారి కలర్‌ టోన్‌ బాగా చేశారు. టీజర్‌, ట్రైలర్‌ చూశారుగదా అదురిపాటుగా వుందంటే సినిమా కుమ్మేసేటట్లు వుంటుంది అన్నారు.

నటుడు నాగబాబు మాట్లాడుతూ, 47 సంవత్సరాలుగా నాటకానుభవం వున్న నాకు ఇందులో ఓ పాత్ర ఇచ్చి ప్రోత్సహించడం అదృష్ట్గంగా బావిస్తున్నానని తెలిపారు.

గోదావరి ఖనిలో పుట్టి పెరిగిన మాకు ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుందని ఈ సినిమాలో నటించిన నాని స్నేహితులు తెలిపారు. రియల్‌ సతీష్‌ తదితరులు మాట్లాడారు.


నటి ఝాన్సీ మాట్లాడుతూ, మొదటి సినిమాలో నానికి అత్తగా చేశాను. ఇప్పుడు నాని నాకు తమ్ముడుగా చేశారు. నా తరహా ఆర్టిస్టులకు మంచి పాత్రను రచయితలు ఇచ్చారు. నాని సినిమాల్లో నెక్ట్స్‌ లెవల్‌ లో వుంటుంది. కీర్తి సురేష్‌ చాలా హంబుల్‌ పర్సన్‌. తన పాత్ర తప్ప మరోటి కనిపించని నటి. కీర్తి తల్లిగా నేను నటించాను అని అన్నారు.

దీక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ, దసరాలాంటి సినిమాలో నాకు మంచి ఆఫర్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ గారికి, నా గైడ్‌ నానిగారికి  థాంక్స్. నిర్మాతగారు స్వంత మనిషిలా చూసుకున్నారు. కీర్తిగారితో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. నేను తెలుగు సినిమా చేస్తానని అనుకోలేదు. కానీ చేశాను.  ఇదంతా ఆశీర్వాదంగా భావిస్తున్నాను అన్నారు.


నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ, నానిగారితో మూడేళ్ళుగా ఈ కథ కోసం ఎదురు చూశాం. అన్నారు.


శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ, మార్చి 30న థియేటర్‌లో కలుద్దామంటూ తెలిపారు.


అనంతం మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

మీరు చూపించిన విజువల్స్‌ కెజిఎఫ్‌. పుష్ప చిత్రాల వాతావరణం  కనిపిస్తుంది. మీ టార్గెట్‌ వారిని రీచ్‌ చేస్తుందా?

మీరు ఎలా ఫీలవుతారో అలా ఫీల్‌ కావచ్చు. మాకు అసలు ఆ ఆలోచన లేదు కూడా.


పర్సనల్‌ గా ఛాలెంజ్‌గా ఈ సినిమాలో  ఏమనిపించింది?


దర్శకుడు చాలా క్లియర్‌ గా రాసుకున్నాడు మాకు ఫిజికల్‌ ఛాలెంజ్‌. పాత్ర పరంగా న్యాయం చేశాం.

ఈ సినిమా తర్వాత ఏ స్థాయిలో మీ కెరీర్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పండి?


మీరు ఏం చేస్తే అది అవుతా. నేను ప్రాణం పెట్టి సినిమా చేశాను. అది ఏ రేంజ్‌ అనేది భగవంతుడికి వదిలేస్తున్నా.


ప్రచారంలో భాగంగా  అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు? ఈ హైప్‌ ఎలా అనిపిస్తుంది? మీ గట్‌ ఫీలింగ్‌ ఎలావుంది?


థియేటర్‌లో హిస్టీరియా క్రియేట్‌ చేస్తుందని చెప్పగలను.


ట్రైలర్‌ అద్భుతమైన ఇంపాక్ట్‌ వుంది. పాన్‌ ఇండియా సినిమా అందులో తెలుస్తుంది. నటుడిగా ధరణి పాత్రలో మీరు పొందిన అనుభవం ఏమిటి?


శ్రీకాంత్‌ కు తెలిసిన ప్రపంచమే ఈ సినిమా. మాకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ధరణి పాత్ర నటనే కాకుండా అన్ని విషయాలు పాత్ర ద్వారా తెలుసుకున్నాను.  తెలంగాణలోని  వీర్లపలి  ప్రాంతమంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది. ధరిణి పాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను.


 పాన్‌ ఇండియాకు వెళ్ళే వారు ప్రూవ్డ్ దర్శకులు ద్వారా వెళ్ళారు. కానీ మీరు కొత్త దర్శకుడితో వెళుతున్నారు. మీ అంచనా ఏమిటి?


మేము ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. పుష్ప ఐదు భాషల్లో విడుదల చేస్తే ఒక బాషలో పెద్ద దర్శకుడు సుకుమార్‌. మిగిలిన నాలుగు భాషలకు పెద్దగా తెలీదు. నాకు శ్రీకాంత్‌పై పూర్తి నమ్మకముంది.


రగ్గ్‌డ్‌ ఇమేజ్‌ ద్వారా దసరా పాన్‌ ఇండియా కు వెళ్ళడం కరెక్టేనా?


ఇది వయెలెంట్‌ మాస్‌ రస్కీ ఫిలిం.


కీర్తిసురేష్‌.. మీరు తెలంగాణ శ్లాంగ్‌ చెప్పిన తర్వాత  ఎలా ఫీలయ్యారు?


నాకు నాలుగు గంటలు కథ చెప్పారు. అర్థం కాలేదు. ఐదవసారి అర్థం అయింది. చాలా మంది హెల్ప్  చేశారు.


నాని.. గారూ.. ఇది పులిమీద స్వారీ లా ఉంది. తదుపరి సినిమా ఎలా వుండబోతోంది?


ఓడిపోతామనేవాడికి పులిమీద స్వారీ. నాకు ఆ భయం లేదు. నాకూ ఏరోజు  పలానా  కాపాడుకోవాలి అనేది లేదు. నాకు మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా.


తెలుగు సినిమా ఆస్కార్‌ తర్వాత మారిపోయింది. కొత్త కంటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి దసారాలో కొత్తదనం ఏముంటుంది.


టీజర్‌, ట్రైలర్‌ చూడగానే క్లారిటీ రావాలి. వచ్చి వుంటుందనుకుంటున్నాను.


ఇందులో మేనరిజం కోసం ఎంత కష్టపడ్డారు?


మేనరిజం అనేది సినిమా సినిమాకూ తేడా వుంటుంది. సాఫ్ట్‌ సినిమాలో సాఫ్ట్‌గా వయెలెంట్‌ సినిమాకూ వయెలెంట్‌గా వుంటుంది.


నాని గారు 15 ఏళ్ళు కెరీర్‌ మీది పూర్తయింది. దర్శకుడిగా కొత్తవారికి ఇవ్వడానికి కారణం?


స్పెషల్‌ కారణం లేదు. కొత్తవారితో చేయాలనే రూల్‌ లేదు. అనుభవం వున్న వారితోనూ చేశాను. టాలెంట్‌ కొత్తది పాతది కాదు. టాలెంట్‌ ఈజ్‌ టాలెంట్‌. కొత్త తరం రావాలి. 2008లో నన్ను కొత్త అనుకుంటే నేను లేను.


హిట్‌ 3 చేస్తున్నారా?


హిట్‌2లో ఎండ్‌ లో చెప్పాం. నేను చేస్తున్నా.


లక్నోలో ట్రైలర్‌ అనుభవం ఎలా వుంది?


దేశమంతా తెలుగు సినిమా చూస్తుందని మాకు తెలిసింది. తమిళ, కన్నడం, మలయాళంలో తెలుగు సినిమా చూస్తున్నారని అర్థమయింది. నేను చెప్పిన డైలాగ్‌ లకు రెస్పాండ్‌ అవుతున్నారు.


శ్రీకాంత్ గారు.  చమ్కీ.. సాంగ్‌ కాంట్రవర్సీ అయింది?


నేను ఊళ్ళలో వున్న పాటే తీసుకున్నా.  కాంట్రవర్సీ నాకు తెలీదు. పాన్‌ ఇండియా అనేది కూడా తెలీదు. నా స్నేహితులు అంతా ఆంధ్రవారే.


విలన్‌ ను రివీల్ చేయలేదు?


సస్పెన్స్‌ కోసమే.


 కీర్తిసురేష్‌..గారు మహానటి తర్వాత పెద్ద ఇమేజ్‌ వచ్చింది. దాన్నిబాలెన్స్‌ చేసే పాత్ర చేయలేదు. ఇది నటిగా మీకు ఎంత ఉపయోగకరం?


కొన్ని సినిమాలకు ఎమోషన్‌ కనెక్ట్‌ వుంటుంది. అది మహానటికి వచ్చింది. ఇప్పుడు దసరాకు వచ్చింది. తెరపై చూస్తే మీకు అర్థమవుతుంది. వెన్నెల క్యారెక్టర్‌ ను మర్చిపోలేరు. ఆ పాత్రలో ఫిట్‌ చేయాలంటే శ్లాంగ్‌ ముఖ్యం.


భోళాశంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా చేస్తున్నారు?


అది ఆ సినిమాలో చెబుతాను.


Share this article :