Home » » Mehar ramesh -Bobby Launched Megapower First Look

Mehar ramesh -Bobby Launched Megapower First Look

 మెహర్ రమేష్ - బాబీ  చేతుల మీదుగా చిరంజీవిపై 'మెగా పవర్' ఫస్ట్ లుక్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా  ఇటీవల ప్రారంభమైన ‘మెగా పవర్‌’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజును  పురస్కరించుకుని దర్శకులు మెహర్‌ రమేష్‌, కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిగారి మీద ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశాం. మేం అడగ్గానే బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మెహర్‌ రమేశ్‌, బాబీ మా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చరణ్‌ పుట్టినరోజున మా సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాం. ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన మా చిత్రం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మెగా హీరోల అభిమానులు అందరి సపోర్ట్‌ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.


Share this article :