Home » » Breath Title Poster Launched by Nandamuri Kalyan Ram

Breath Title Poster Launched by Nandamuri Kalyan Ram

 నందమూరి చైతన్యకృష్ణ, వంశీకృష్ణ ఆకెళ్ళ, నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1 ‘బ్రీత్’ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్



నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని నందమూరి కళ్యాణ్ రామ్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘బ్రీత్’ అనే టైటిల్ ఖరారు చేశారు.


ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ పై  ప్రొడక్షన్ నెం 1 సినిమా బ్రీత్ టైటిల్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో మా పెదనాన్న నందమూరి జయకృష్ణ గారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మా అన్నగారైన నందమూరి చైతన్యకృష్ణ గారు ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇది ఎమోషనల్ థ్రిల్లర్. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ అలరిస్తుందని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు


నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. బ్రీత్ ఎమోషనల్ థ్రిల్లర్. చైతన్య ప్రధాన పాత్ర పోషించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.  


ఈ చిత్రంలో చైతన్య కృష్ణకు జోడిగా వైదిక సెంజలియా నటించారు. రాకేష్ హోసమణి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు.


తారాగణం: నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ , కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర తదితరులు


సాంకేతిక విభాగం :

రచన & దర్శకత్వం - వంశీకృష్ణ ఆకెళ్ళ

నిర్మాత - నందమూరి జయకృష్ణ

బ్యానర్: బసవతారకరామ క్రియేషన్స్

డీవోపీ - రాకేష్ హోసమణి

సంగీతం - మార్క్ కె రాబిన్

ఎడిటర్ - బి.నాగేశ్వర్ రెడ్డి

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - గాదిరాజు రామరాజు

ఆర్ట్ డైరెక్టర్ - భాస్కర్ ముదావత్

పీఆర్వో: వంశీ-శేఖర్


Share this article :