సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, యలమంద చరణ్, హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా కామెడీ డ్రామా ‘భువన విజయమ్’ టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతి
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం టీజర్ ని డైరెక్టర్ మారుతి లాంచ్ చేశారు. టీజర్ ఒక ఆసక్తికరమైన వాయిస్ ఓవర్ తో మొదలైయింది. ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూసర్.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ.. చావుబతుల మధ్య వున్న కూతురుని బ్రతికించుకోవడానికి ఓ తండ్రిపడే వేదన.. పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’ అంటూ సాగిన వాయిస్ ఓవర్.. ఒకొక్క పాత్ర పరిచయం, ఆసక్తిని రేపే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ఇలా ప్రధాన తారాగణం అంతా తమ ఫెర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ‘భువన విజయమ్’ క్యురియాసిటీని పెంచే కథనంతో.. హిలేరియస్ ఎంటర్ టైనర్ అనే భరోసా టీజర్ ఇచ్చింది.
టీజర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం మరో ఆకర్షణగా నిలిచింది. సాయి సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. నిర్మాణ విలవలు ఉన్నతంగా వున్నాయి. ఛోటా కె ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్.
శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.
వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: సునీల్ ,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ , వైవా హర్ష , బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ , గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ ,సోనియా చౌదరి, స్నేహల్ కామత్ , షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు
టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: యలమంద చరణ్
బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా
నిర్మాతలు: కిరణ్, విఎస్కే
సమర్పణ: శ్రీమతి లక్ష్మి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సాయి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో : తేజస్వి సజ్జ
Post a Comment