రైటర్ పద్మభూషణ్’ ప్రిమియర్స్ కి వచ్చిన అద్భుతమైన స్పందన విజయాన్ని సాధించామనే ఆనందాన్ని ఇచ్చింది:’ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్’ లో చిత్ర యూనిట్
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సుహాస్ మాట్లాడుతూ.. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు. రేపటి కోసం ఎదురుచూస్తున్నాను. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయాలు సాధించాలి’’ అన్నారు.
శరత్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని పేరు పెట్టాం. సినిమా విడుదల వుంది. కానీ మాకు ఒత్తిడి లేదు. మేము సక్సెస్ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులు గా.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్ లోకి తెచ్చాం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. ఒక పెద్ద స్టార్ కి వుండే రెస్పాన్స్ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వర్డ్ అఫ్ మౌత్ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలౌతుంది. మా సినిమాతో పాటు వస్తున్న సందీప్ కిషన్ గారి మైఖేల్, నాగ వంశీ గారి సినిమా.. అన్నీ సినిమాలు మంచి విజయాలు సాధించాలి. ’’ అని కోరారు
షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని నమ్మకంగా పేరు పెట్టాం . మా నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే నమ్మకాన్ని విడుదల తర్వాత ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను.
టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకుల ఆదరణ, స్పందన చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
గౌరీ మాట్లాడుతూ.. ప్రిమియర్స్ కి వచ్చిన స్పందన చూస్తే నాకు ఆనందం మాట రాలేదు. చాలా గొప్పగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి’’ అని కోరారు.
చంద్రు మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు స్క్రీన్స్ అయ్యాయి. అద్భుతమైన స్పందన వచ్చింది. లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీ లో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది. ఆల్రెడీ విజయం సాధించిన ఆనందం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.
కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ... ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది . మీ అందరి సపోర్ట్ కావాలి.’’ అన్నారు.
Post a Comment