Home » » Oo Antava Mava Oo oo Antava Mava Releasing as Sivarathri Spl

Oo Antava Mava Oo oo Antava Mava Releasing as Sivarathri Spl

 శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’



యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మాత. పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 18న విడుదల కానుందీ చిత్రం. 


నిర్మాత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ...

‘‘రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్‌ అంతా  ఇది మన సినిమా అని ఆప్యాయంగా పని చేశారు.  కాశ్మీర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ చేశాం. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హారర్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ప్రసాద్ లాబ్స్ లో చాలామంది కి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది. ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న విడుదల చేస్తాం’’ అని అన్నారు. చిన్న సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అని అనుకుంటున్నాం.



యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, రఘు కుంచె, సురేశ్‌ కొండేటి, తుమ్మలపల్లి, రామారావు,  రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ సినీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


నటీ, నటులు

యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు.


 *సాంకేతిక నిపుణులు* 

నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్‌

ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ 

దర్శకత్వం : రేలంగి నరసింహారావు

కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ 

సంగీతం: సాబు వర్గీస్,

కెమెరా: కంతేటి శంకర్

ఎడిటర్ : వెలగపూడి రామారావు

మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్

పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్

ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి

కో డైరెక్టర్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు

ప్రొడక్షన్ డిజైనర్ : గోలి వెంకటేశ్వర్లు


Share this article :