Kadambari Kiran Daughter Marriage Held Grandly

 కన్నుల పండువగా కాదంబరి కిరణ్ కుమార్తె కళ్యాణం!!




      ప్రముఖ నటుడు - సేవాతత్పరుడు "మనం సైతం" కాదంబరి కిరణ్ కనిష్ట కుమార్తె డా: పూర్ణ సాయి శ్రీ వివాహం చి. శ్రీ సాయి భార్గవ తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1, 2023) 9.34 నిమిషాలకు... హైదరాబాద్, "తారామతి బారాదరి"లో అత్యంత శాస్త్రోక్తంగా జరిగిన ఈ పరిణయ మహోత్సవానికి సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

     తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ, చైర్మన్ కిశోర్ గౌడ్, హీరో శ్రీకాంత్, సినీ ప్రముఖులు మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, రామజోగయ్య శాస్ట్రీ, తనికెళ్ల భరణి, భాస్కరభట్ల, సాయికుమార్, రఘుబాబు, రాకెట్ రాఘవ, బెనర్జీ, అలి, సుబ్బరాయశర్మ, అశోక్ కుమార్, వినోద్ బాల, రజిత, రచ్చ రవి, సన...  దర్శకులు రేలంగి నరసింహారావు, అల్లాణి శ్రీధర్, నాగు గవర, ప్రేమరాజ్... నిర్మాతలు బండ్ల గణేష్, అశోక్ కుమార్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సింగర్స్ విజయ లక్ష్మి, కౌసల్య, కొమర వెంకటేష్, మోహన్ గౌడ్, పీవీయస్ వర్మ, పెద్ద సంఖ్యలో టీవీ కళాకారులు హాజరైనవారిలో ఉన్నారు!!

Post a Comment

Previous Post Next Post