హరీష్ శంకర్ చేతులు మీదుగా "రిచి గాడి పెళ్లి" ట్రైలర్ లాంచ్
కె.ఎస్.ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం "రిచి గాడి పెళ్లి" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన తారాగణంగా కెఎస్ హేమరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హరీష్ శంకర్ లాంచ్ చేసారు,. రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని అర్ధమవుతుంది. ఆ చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశం.
దర్శకుడు కె యస్ హేమరాజ్ “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. అని ఇదివరకే చెప్పుకొచ్చారు. ఆ మాదిరిగానే ట్రైలర్ ను డిజైన్ చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది.
సినిమా పేరు: రిచి గాడి పెళ్లి
నటీనటులు: సత్య SK
బ్యానర్: కెఎస్ ఫిల్మ్ వర్క్స్
నిర్మాత: కేఎస్ హేమరాజ్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: KS హేమరాజ్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
సంగీతం: సత్యన్
ఎడిటర్: అరుణ్ EM
కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
సాహిత్యం: అనంత శ్రీరామ్ & శ్రీ మణి
పి ఆర్ ఓ : మధు వి ఆర్