Home » » Hero Suhaas Interview About Writer Padmabhushan

Hero Suhaas Interview About Writer Padmabhushan

‘రైటర్ పద్మభూషణ్‌’ అందరికీ కనెక్ట్ అవుతాడు. అందరినీ ఎంటర్ టైన్ చేస్తాడు: సుహాస్ 




ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్‌ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో సుహాస్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


 


రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణం ఎలా మొదలైయింది ?


ప్రశాంత్ ‘కలర్ ఫోటో’ సినిమాకి సహాయ దర్శకుడు. తర్వాత ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా చేశాను. దానికి ప్రశాంత్ రైటర్. తను అలా పరిచయం. కలర్ ఫోటో తర్వాత ఈ కథ చెప్పాడు. చాలా ఎక్సయిట్ అయ్యాం. నిర్మాతలు అనురాగ్, శరత్ కి చెప్పాం. వారూ ఎక్సయిట్ అయ్యి వెంటనే తెరకెక్కించారు.


 


అంత ఎక్సయిట్ అయిన పాయింట్ ఏమిటి ?


సినిమా అంతా చాలా ఎక్సయిటింగా వుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్‌ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఇందులో అనుమానమే లేదు.


 


రైటర్ పద్మభూషణ్‌ లో సస్పెన్స్ ట్విస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయా ?


వుంటాయి. ఫస్ట్ హాఫ్ లో రెండు, సెకండ్ హాఫ్ లో మూడు ట్విస్ట్ లు వస్తాయి. క్లైమాక్స్ లో ఇంకా మంచి ట్విస్ట్ వుంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.


 


కొత్త దర్శకులతో పని చేయడం రిస్క్ కదా ?


నేను కొత్త వాడినే కదండీ. ఛాయ్ బిస్కెట్ లో కొత్త వాళ్ళు రాసిన స్క్రిప్ట్ లతోనే నాకు పేరు, అవకాశాలు వచ్చాయి. వాళ్ళ కథలు బావుంటాయి, ప్రేక్షకులకు నచ్చుతాయనే నమ్మకం ఆశతో మేము అంతా ఒక టీంగా ప్రయాణం చేస్తున్నాం.


 


చెప్పిన టైం కంటే ముందే సెట్స్ లో ఉంటారట కదా ?


కొంచెం ముందే వెళ్ళిపోతే పనులు సరైన సమయంలో జరుగుతాయి. హను రాఘవపుడి, శివ నిర్వాణ లాంటి దర్శకులతో పని చేస్తున్నపుడు ఇది అలవాటైయింది. వాళ్ళు ఉదయం ఐదు గంటలకే సెట్ లో వుంటారు. అలా వుండట వలన పనులు ఫాస్ట్ గా నడుస్తాయి. ఈ సినిమాకి అరవై రోజులు అనుకున్నాం, కానీ 43 రోజుల్లోనే పూర్తి చేశామంటే దానికి కారణం ఇదే.


 


ఇది మీ మొదటి థియేటర్ రిలీజ్ మూవీ.. ఇంకా విడుదల కాకముందే చాలా సినిమాలు లైన్ లో పెట్టినట్లు వున్నారు ?


తర్వాత సినిమా గీతా ఆర్ట్స్ 2 లో వస్తోంది. షూటింగ్ పూర్తయింది. తర్వాత ఆనందరావు అడ్వంచర్స్ అనే మరో సినిమా చేస్తున్నాను. అన్ని మంచి కథలు. త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు చూపించాలనే ఎక్సయిట్ మెంట్ వుంది. 


 


ఈ కథకు నిర్మాతలని మీరు ఒప్పించారా లేదా దర్శకుడా ?


కంటెంట్ తనదే కాబట్టి ఆ భాద్యత తనపైనే వుంటుంది. అయితే నేను ఒక సోర్స్ గా మాత్రమే వున్నాను. మా హోం బ్యానర్ కాబట్టి ఒకసారి కథ వినండనని చెప్పాను. ఈ కంటెంట్ కి ఎవరైనా ఎక్సయిట్ అవుతారు. చాలా మంచి కంటెంట్. ట్రైలర్ లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. సినిమా చూసిన తర్వాత అది అర్ధమౌతుంది.


 


మీ కథలని ఎలా జడ్జ్ చేస్తారు ?


దీని కోసం పెద్ద ఆలోచించి లెక్కలు వేసుకోవడం వుండదు. కథ వింటున్నపుడు నేను ఎలా ఎంజాయ్, ఎక్సయిట్ అవుతున్నానో చూస్తాను. డబ్బులు పెట్టె నిర్మాతలకు కూడా అదే ఎక్సయిట్ మెంట్ వుందోలేదో చూసుకుంటాను. ఇలా అందరూ ఉత్సాహంగా ఉంటేనే చేయొచ్చనే నమ్మకం వస్తుంది.


 


మీరు చేసిన చిత్రాల్లో బాగా నచ్చిన చిత్రాలు ఏమిటి ?


‘కలర్ ఫోటో’ నా కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా చాలా ఇష్టం. అలాగే తెరపై నన్ను నేను చూసుకున్న చిత్రం మజిలీ. అలా తెరపై చూసుకోవడంలో ఆ ఆనందమే వేరు.


 


రైటర్ పద్మభూషణ్‌ మీ తొలి థియేటర్ మూవీ కదా ? ఒత్తిడి ఫీలౌతున్నారా ?


ఆనందం వుంది. అదే సమయంలో చిన్న నెర్వస్ నెస్ కూడా వుంది.(నవ్వుతూ)  మౌత్ టాక్ తో జనాలు తప్పకుండా థియేటర్ వస్తారనే నమ్మకం వుంది. వస్తే తప్పకుండా ఎంజాయ్ చేసే వెళ్తారు.


 


ఛాయ్ బిస్కెట్ గురించి ?


షార్ట్ ఫిలిమ్స్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఆ బాండింగ్ ఖచ్చితంగా వుంటుంది. అక్కడ ఉన్నప్పుడు సినిమాలకి ప్రమోషన్స్ చేయడం వలన చాలా పరిచయాలు వచ్చాయి. దీంతో సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత సులువైయింది. దిని అంతటికి కారణం ఛాయ్ బిస్కెట్. షార్ట్ ఫిల్మ్ తో మొదలై ఈ రోజు సినిమా చేస్తున్నామంటే చాలా ఆనందంగా గర్వంగా వుంది.


 


షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చారు కదా.. ఇప్పుడు పెద్ద పోస్టర్స్ పై మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ?


అది ఎలాంటి ఫీలింగో చెప్పలేను కానీ ఫ్రండ్స్ దగ్గర మాత్రం ‘’ ఇలా జరుగుతుందని అసలు అనుకున్నామా’’ అని చెబుతుంటాను.


 


డ్రీం రోల్స్ ఉన్నాయా ?


చిన్న పాత్రలు చేస్తే చాలు అని అనుకున్నాను. చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. రచయితల వలన చాలా భిన్నమైన పాత్రలు చేసే అవకాశం వస్తుంది. వచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే దానిపైనె నా ద్రుష్టి వుంది.


 


రైటర్ పద్మభూషణ్‌ నటీనటుల గురించి ?


ఆశిష్ విద్యార్ధి, రోహిణీ లాంటి నటులు ఇందులో భాగం కావడం అదృష్టం. కథ నచ్చి చేశారు. అలాగే గోపరాజు రమణ గారు హీరోయిన్ ఫాదర్ గా మంచి పాత్ర చేశారు.  ఇందులో హీరోయిన్ నాకు మరదలి వరస అవుతుంది. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది.


 


చివరిగా రైటర్ పద్మభూషణ్‌ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ?


ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారు. హెవీ హార్ట్ ఫీలింగ్ తో మంచి చిరునవ్వుతో బయటికివస్తారు. మంచి సినిమా చేశారని అభినందిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్




Share this article :