Telugu Movie Launched in Toronto

 తెలుగు చిత్రం టొరెంటోలో ప్రారంభం !!!



6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సూర్య బెజవాడ నిర్మాతగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టొరెంటోలో వైభవంగా తెలుగు ప్రేక్షకల మధ్య ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్ కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలిం ను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది.


వెన్నెల కిషోర్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తారు. 


దర్శకుడు వరుణ్ కోరుకొండ ప్యాషన్ తో తెరకెక్కిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post