TFJA PRESS NOTE
Power Star Pawan Kalyan Garu launched Telugu Film Journalist Association ( TFJA ) Offical website, YouTube, and Social Media Accounts.
జనసేనాని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదలైన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ & సోషల్ మీడియా అకౌంట్స్..
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రెటరీ వై. జె. రాంబాబు గారు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ గారు, గార్ల ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి ఉండే తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది, 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత భీమా కింద 15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు ఇవ్వడం వారి కుటుంభం సభ్యులకి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 175 మంది జర్నలిస్టుల పై ఆధారపడ్డ వారిని కలిపి దాదాపు 700 మందికి అవసరమొచ్చినప్పుడు ఆసరా లభిస్తుంది. అలాగే వీరు ఆదర్శవంతమైన జర్నలిజం, సమాజంలోని తప్పొప్పులని సరి చేసేలాగా, అవసరం లేని వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుంది అని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను..