ముఖేష్ కుమార్ రెండో చిత్రం
"మూడు చేపల కథ"
ప్రచారచిత్రం ఆవిష్కారం!!
"సమంత" ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం "మూడు చేపల కథ" విడుదలకు సిద్ధమవుతోంది. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగింది.
దర్శకుడు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా "మూడు చేపల కథ" రూపొందించాం. అందరినీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ, జీలన్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ పాల్గొన్నారు!!
పృథ్వి, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాథ్, హర్ష, రెహ్మాన్, అనంతనేని గోపాలకృష్ణ, యాంకర్ సత్తెన్న, ధీరజ అప్పాజీ, శేషు కుమార్, ముఖేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసిస్టెంట్ డైరెక్టర్స్: డా: కల్యాణ్, సుభాష్ గయ్, డి.ఓ.పి: లోహిత్ - అబ్దుల్లా - హర్షా, ఎడిటర్: సాయి కుమార్ ఆకుల, నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ - పృథ్వి సినిమాస్, రచన - ఆలోచన - దృశ్యరూపం : ముఖేష్ కుమార్!!