GA2 Pictures Production No 8 Launched Grandly

 మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నివాస్, విద్య మాధురి నిర్మాత‌లుగా తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 ప్రారంభం..



విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్.  జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో సంచలన నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:


శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల..


టెక్నికల్ టీం:


దర్శకుడు: తేజ మర్ని

నిర్మాతలు: బన్నీ వాస్, విద్య మాధురి

బ్యానర్: GA2 పిక్చర్స్

సమర్పణ: అల్లు అరవింద్

కో ప్రొడ్యూసర్: భాను ప్రతాప

రైటర్: నాగేంద్ర కాశీ

సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకటి

సంగీతం: శక్తికాంత్ కార్తీక్

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి ఎరమల

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Post a Comment

Previous Post Next Post