Ento Enteynto Lyrical Song Launched From Thankyou

థ్యాంక్యూ చిత్రం నుంచి మ్యూజికల్ మెలోడి ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో లిరికల్ సాంగ్ విడుదల




కథానాయకుడు  అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన  ఈ చిత్రం నుంచి ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో అంటూ కొనసాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను గురువారం విడుదల చేసింది చిత్రబృందం.బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడు తమన్ స్వరాలను అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి  బీవీఎస్ రవి కథను అందించారు. 



Post a Comment

Previous Post Next Post