Home » » Tremendous Response for Pathala Lyrical from Vikram

Tremendous Response for Pathala Lyrical from Vikram

 కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 'విక్రమ్' ఫస్ట్ సింగల్  'పతళ పతళ' పాటకు ట్రెమండస్ రెస్పాన్స్..  

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ 'యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా 'పతళ పతళ' అనే పాటని ఇటివలే విడుదల చేశారు. ఈ పాటకు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్  మాస్, బాస్ నెంబర్ గా ఈ పాటని డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వుంది 'పతళ పతళ' సాంగ్. ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ మూవ్స్‌తో వింటేజ్ గ్రేస్‌ చూపించారు.  కమల్ హాసన్ ఈ పాట కు సాహిత్యం అందించడంతో పాటు ఆయనే పాటని ఆలపించడం మరో ప్రత్యేకత.


తాజాగా విక్రమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. మే 16 చెన్నైలో 'విక్రమ్' థియేట్రికల్  ట్రైలర్, ఆడియోని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.


ఈ చిత్రంలో విజయ్ సేతుపతి  విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు.


ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా,  గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా , ఫిలోమిన్ రాజ్  ఎడిటర్ గా పని చేస్తున్నారు.  ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్దమౌతుంది.


తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: లోకేష్ కనగరాజ్

నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్

బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్


Share this article :