Ashokavanam lo Arjuna Kalyanam Entered Second Week with Strong Collections

 టెర్రిఫిక్‌ సెకండ్‌ వీక్‌ కలెక్షన్ల వైపు అశోకవనంలో అర్జునకల్యాణం



విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది అశోకవనంలో అర్జున కల్యాణం. రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. సిట్చువేషనల్‌ కామెడీ, లవ్‌ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో  కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం.


సినిమా విడుదలై వారం రోజులు అయినా ఇంకా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. రెండో వారంలోనూ ఇన్ని మంచి థియేటర్లతో సినిమా రన్‌ అవుతుంటే మనసు నిండిపోయిందన్నది మేకర్స్ మాట. విశ్వక్‌సేన్‌ చేసిన హార్డ్ వర్క్ కి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల పంట పండుతోందని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.


తనకు నచ్చిన అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలని 33 ఏళ్ల యువకుడు నిజాయతీగా చేసిన ప్రయత్నంగా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్పెషల్‌ అప్లాజ్‌ వస్తోంది. తనకున్న మాస్‌ ఇమేజ్‌ని పక్కనపెట్టి , కాస్త బరువుపెరిగి కేరక్టర్‌లో లీనమై విశ్వక్‌సేన్‌ నటించిన తీరుకు జనాలు మెచ్చుకుంటున్నారు.


డైరక్టర్‌ విద్యాసాగర్‌ చింత ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రవికిరణ్‌ కోలా రాసిన కథలో సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ కి యూత్‌ ప్లస్‌ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జై క్రిష్‌ కంపోజ్‌ చేసిన ట్యూన్ల, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా సక్సెస్‌లో కీలక భాగమవుతోంది.

Post a Comment

Previous Post Next Post