రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ `అనుష్క` ట్రైలర్ లాంచ్
సుధారాణి క్రియేటివ్స్ పతాకంపై తేజస్, సౌజన్య శివ, జషిల్, శ్రీవల్లీ నటీ నటులుగా సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `అనుష్క`. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``అనుష్క` ట్రైలర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. గతంలో సుదర్శ న్ రెడ్డి అనుష్క నటించిన `అరుంధతి` చిత్రానికి గ్రాఫిక్ విభాగంలో పని చేశాడు. ఆ అనుభవం, ఆ అభిమానంతో `అనుష్క` టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. కథా బలంతో ఈచిత్రం రూపొందింది. అన్నీ తానై ఎంతో కష్టపడ్డాడు. దర్శక నిర్మాత మా చాంబర్ మెంబర్ కావడంతో అన్నీ విధాలుగా సపోర్ట్ అందిస్తున్నాం. అంతా నూతన తారగణం నటిస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
దర్శక నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...``ప్రతాని గారు మా చిత్రానికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారి చేతుల మీదుగా మా చిత్రం ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అనేక ట్విస్ట్ లతో సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం`` అన్నారు.
హీరో తేజస్ మాట్లాడుతూ...`` నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అధ్యక్షులుగా పని చేసిన లేట్ కాంచనబాబుగారి అబ్బాయిని. ఈ సినిమా లో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నా. మా నాన్నతో పాటు ప్రేక్షకులు ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని నమ్ముతున్నా`` అన్నారు.
హీరోయిన్ సౌజన్య మాట్లాడుతూ...``నేను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించా. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్`` అన్నారు.
మరో హీరోయిన్ శ్రీవల్లి మాట్లాడుతూ...`` చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూసుకున్నారు. మా దర్శకుడు ఎంతో ప్యాషన్ తో సినిమా చేశారు. ఇంత మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః సోవన్ చిన్న; సినిమాటోగ్రఫీః నవీన్ కుమార్ చిడతల; కథ-స్క్రీన్ ప్లే- నిర్మాత-దర్శకత్వంః సుదర్శన్ రెడ్డి.