Megastar Chiranjeevi Wishes to Surabhi 70mm Team

 ఫిబ్రవరి 18 న రిలీజవుతున్న సురభి 70 ఎం.ఎం మూవీ కి మెగాస్టార్ చిరంజీవి విషెస్.



బాబీ ఫిలిమ్స్ బ్యానర్ పై గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో యూత్ ఫుల్

ఫామిలీ డ్రామాగా తెరకెక్కిన సినిమా సురభి 70 ఎం ఎం విడుదలకి సిద్ధం

అయింది .నాలుగు పాటలు ఉన్న ఈ సినిమా ఆడియో ప్రముఖ ఆడియో సంస్థ మధుర

ఆడియోస్ విడుదల చేసింది .డెన్నిన్స్ నార్టన్ సంగీతం అందించిన నాలుగు

పాటలకి దర్శకుడు గంగాధర వై కె అద్వైత లిరిక్స్ రాసారు . ఇప్పటికే రిలీజ్

ఐన " చిట్టి చిట్టి కన్నులో" అనే చిరంజీవి ట్రిబ్యూట్ సాంగ్ మెగాస్టార్

చిరంజీవి వరకు చేరింది.ఆ సాంగ్ చూసి మెగాస్టార్ చిరంజీవి టీమ్ ను ఇంటికి

పిలిచి అభినందించారు.అంతే కాదు.. 18న రిలీజవుతున్న ఈ సినిమా విజయవంతం

కావాలని ఆకాక్షించారు.


ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18 న విడుదల అవ్వబోతున్న సురభి 70  ఎం ఎం సినిమా

సూపర్ హిట్ అవుతుంది అని చిత్ర యూనిట్ అంటున్నారు .

వినోద్ , అనిల్ , ఉషాంజలి , మహేష్ వై , అక్షిత ,చంద్రకాంత్ , శ్లోక ,

యోగి , అనీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కె కె చైతన్య నిర్మాతగా

ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post