Home » » Inti No 13 Trailer Launched

Inti No 13 Trailer Launched

 మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ ట్రైలర్ విడుద‌ల‌‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి, టీజర్‌కు, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నిర్మాత రాజ్ కందుకూరి అతిథిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా నటుడు ఆనంద్ రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ‘ఇంటి నెం.13’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను. చాలా మంచి సినిమా చేసాన‌న్న సంతృప్తి ఈ సినిమా నాకు ఇచ్చింది. ప‌న్నా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాలో న‌టించిన ఆర్టిస్టులంతా తమ క్యారెక్ట‌ర్ల‌కు పూర్తి న్యాయం చేశారు. అలాగే మ‌ణిక‌ర్ణ‌న్ మంచి ఫోటోగ్ర‌ఫీ అందించారు. వినోద్ యాజ‌మాన్య మ్యూజిక్ సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. నిర్మాత హేస‌న్ పాషాగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా ఈ సినిమాను నిర్మించారు. త‌ప్ప‌కుండా  ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు.

ఈ సంద‌ర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ప‌న్నా మీద ఉన్న న‌మ్మ‌కంతోనే నిర్మాత హేస‌న్ పాషా గారు ఈ సినిమా ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ ప‌న్నా త‌న బిడ్డ‌లాంటివాడు అన్నారు. ఏ డైరెక్ట‌ర్‌కి అయినా తండ్రిలాంటి నిర్మాత దొర‌క‌డం చాలా అదృష్టం. ఈ విష‌యంలో ప‌న్నా చాలా ల‌క్కీ. అంద‌రూ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇది ఏ భాష‌కైనా, ఏ ప్రాంతానికైనా సూట్ అయ్యే సినిమా కాబ‌ట్టి నేను దీన్ని గ్లోబ‌ల్ మూవీ అంటున్నాను’’ అన్నారు.

నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ పన్నా నాకు  కొడుకు లాంటివాడు. ఈ సినిమా విష‌యంలో అత‌నికి పూర్తి స్వేచ్చ‌నిచ్చాను. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్ సంస్థ ప‌న్నాదే, నాది కాదు’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ మాట్లాడుతూ.. ‘ట్రైల‌ర్ చూసి అంద‌రూ బాగుంద‌ని చెప్తున్నారు. సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే దానికి నిర్మాత హేస‌న్ పాషాగారు ఇచ్చిన ఫ్రీడ‌మే కార‌ణం. ఒక సాంగ్‌ని గోవాలో చేద్దాం అని అంటే... కాదు, ఇండోనేషియాలో చెయ్య‌మ‌ని ఎంక‌రేజ్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చింది. ఈ సినిమా ఫ‌స్ట్ హాఫ్ అంతా క్యారెక్ట‌ర్ల ఎస్టాబ్లిష్‌మెంట్  ఉంటుంది.  సెకండాఫ్ ఒక్క సెకండ్ కూడా ఆడియ‌న్స్ త‌ల తిప్ప‌కుండా చూస్తారు. ఈ విష‌యంలో నేను ఎంతో కాన్పిడెంట్‌గా ఉన్నాను. ఆనంద్‌రాజ్‌గారు, త‌నికెళ్ళ భ‌ర‌ణిగారి ఎంట్రీతో సినిమా నెక్స్‌ట్ లెవ‌ల్‌కి వెళ్లింది. అంద‌రూ ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో  ఉందంటున్నారు. కానీ, విజువ‌ల్‌గా మాత్ర‌మే హాలీవుడ్ మూవీలా ఉంటుంది, కంటెంట్ ప‌రంగా చూస్తే ఇది పూర్తిగా ఇండియ‌న్ మూవీలా ఉంటుంది. టెక్నిక‌ల్‌గా మాత్రం చాలా హై రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో టెక్నీషియ‌న్స్ న‌న్ను డామినేట్ చేశార‌ని చెప్పాలి. సినిమా రిలీజ్ విషయానికి వ‌స్తే పెద్ద సినిమాల‌ను త‌ప్పిస్తే  చిన్న సినిమాల‌కు మా సినిమా మంచి పోటీ ఇస్తుంది. మేం వారికి ఎదురెళ్ళినా, మా సినిమాకు వాళ్లు ఎదురొచ్చినా ఆ సినిమాల‌కే న‌ష్టం. అంటే సినిమా ఔట్‌పుట్ విష‌యంలో అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’  అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు వినోద్ యాజ‌మాన్య మాట్లాడుతూ ‘‘ప‌న్నాగారు సినిమాను చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్న‌ప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెన్స్ ఎంతో ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మంచి మ్యూజిక్ ఇవ్వ‌డానికి ట్రై చేశాను. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత నా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవ‌డం చాలా ఆనందాన్ని క‌లిగిస్తోంది’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఎడిట‌ర్ ఎస్‌.కె.చ‌లం, సినిమాటోగ్రాఫ‌ర్ పి.ఎస్‌.మ‌ణిక‌ర్ణ‌న్‌, హీరోయిన్ శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, గుండు సుద‌ర్శ‌న్‌, పాట‌ల ర‌చ‌యిత రాంబాబు గోశాల త‌దిత‌రులు పాల్గొన్నారు.

నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గీతాసింగ్‌, శ్రీ‌ల‌క్ష్మి, గుండు సుద‌ర్శ‌న్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌,  ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, కొరియోగ్ర‌ఫీ: కె.శ్రీ‌నివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగ‌ర్స్ శ్రియా గోష‌ల్‌, రాజ‌ల‌క్ష్మి(త‌మిళ్ సామి సాంగ్ ఫేమ్‌), మాల్గాడి శుభ‌, ఐశ్వ‌ర్య యాజ‌మాన్య‌, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌Share this article :