Home » » Young hero Akash Puri launched the first single from MadhuraPudi Gramam Ane Nenu

Young hero Akash Puri launched the first single from MadhuraPudi Gramam Ane Nenu

 ఆకాష్ పురీ చేతుల మీదుగా "మధురపూడి గ్రామం అనే నేను" సినిమా ఫస్ట్

లిరికల్ సాంగ్ 'వెల్లే గోరింక' విడుదల




శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "మధురపూడి గ్రామం అనే

నేను". జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ

చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు

నిర్మాతలు. నూతన దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా

హీరో ఆకాష్ పూరీ "మధురపూడి గ్రామం అనే నేను" సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్

'వెల్లే గోరిక' ను విడుదల చేశారు. అనంతరం పాట బాగుందంటూ  హీరో శివ

కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.


మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని

అందించగా..ధనుంజయ్, సాహితీ పాడారు. వెల్లే గోరిక పాట ఎలా ఉందో

చూస్తే...వెల్లే గోరింక మళ్లి రావే నా వంక...నన్నే నేను మరిసిపోయా నిన్నే

చూశాక...చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా ..పోతా ఉంటే రారా అంటూ గోలే

చేయమాక...పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక..రైకలో దాచేయవే గుండెనే

పారేయక..అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట.


త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు - కె శ్రీధర్

రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - కె శ్రీనివాసరావు,

వై అనిల్ కుమార్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - సురేష్ భార్గవ్,

ఎడిటర్ - గౌతమ్ రాజు, ఫైట్స్ - రామకృష్ణ, మాటలు - ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్

ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, పీఆర్వో - జీఎస్ కే మీడియా, సమర్పణ - జి

రాంబాబు యాదవ్, బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు - కేఎస్

శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం - మల్లి.


Share this article :