Home » » Pakka Commercial Song Glimpse on January 31st

Pakka Commercial Song Glimpse on January 31st

 'జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..' 'పక్కా కమర్షియల్' తొలి సింగిల్ విడుదల.. January 31st



మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ Jan 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ లో ఉంది. Jan 2 పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు.

'జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు' అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ లో ఉంటాయని మారుతి చెప్పారు. సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం:


ద‌ర్శ‌కుడు - మారుతి

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - SKN

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్


Share this article :