Sekhar Master launches "America Abbayi Pelli Lolli" song Biggboss5 telugu fame VISHWA

 అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన శేఖర్ మాస్టర్ !!!




నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది. 


ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. తాజాగా ఈ సాంగ్ ను ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సాంగ్ రిలీజ్ తరువాత చూసిన అందరూ కాన్సెప్ట్, మ్యూజిక్ ముఖ్యంగా విశ్వ స్టెప్స్ బాగున్నాయని అంటున్నారు.


రవిగంజం దర్శకత్వంలో రావుతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు, అఖిలేష్ కాలారు సాహిత్యం అందించారు, శివ శంకర్ వర్మ సినిమాటోగ్రఫీ అందించారు, ఎడిటింగ్ శివశంకర్ నాగళ్ళ చేశారు అలాగే అఖిల్ కట్ట కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్ కలారు నిర్మించారు.

Post a Comment

Previous Post Next Post