Home » » 10th Class Dairies Teaser Launched Grandly

10th Class Dairies Teaser Launched Grandly

 '96', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'కొత్త బంగారు లోకం' కోవలో 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా  ఉంటుంది!

- టీజర్ లాంఛ్‌లో దర్శకుడు 'గరుడవేగ' అంజి



అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు 'హిప్ హాప్' తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


సి. కళ్యాణ్ మాట్లాడుతూ "చిన్నాతో నాది 40 ఏళ్ల స్నేహం. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అతను మ్యుజిషియన్. చిన్నా నేపథ్య సంగీతం చేయడం అనేది నాతో మొదలైంది. నేను, శివమణి, ఎస్పీ బాలు, చిన్నా... మేమంతా బ్యాచ్. సినిమా ఇండస్ట్రీలో ఒక చేతికి ఇంకో చేయి తోడైతేనే సక్సెస్ వస్తుంది. ఒక్కడితో ఎప్పుడూ సక్సెస్ రాదు. మా గురువుగారు ఎప్పుడూ అదే చెప్పేవారు. నిర్మాత అచ్యుత రామారావు తమకు ఇంకో ముగ్గురు తోడయ్యారని చెబితే సంతోషం అనిపించింది. అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. తనకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. పనిలో అంజి చిచ్చరపిడుగు. రైటర్ దర్శకుడు అయితే... ప్రతి సీన్, డైలాగ్ మీద ప్రేమతో ఉంచుతారు. చివరకు, నిడివి సమస్య వస్తుంది. కెమెరామెన్ డైరెక్టర్ అయితే... ప్రతి షాట్, సన్నివేశంలో తన ప్రతిభ చూపించాలని అనుకుంటాడు. ప్రేమను కూడా పక్కనపెట్టి పనిచేసే వ్యక్తి అంజి. వందో సినిమా వరకూ డైరెక్షన్ చేస్తాడు. రామారావుగారు మంచి సినిమా చేయాలని తాపత్రయపడ్డారు. నలుగురు నిర్మాతలు కలిసి సినిమా చేశారు. ఇలాగే ఏడాదికి నాలుగు సినిమాలు చేయాలని, ఒక్కటిగా చేయాలని, మా అంజితో మరో నాలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంజి పెద్ద మాస్ దర్శకుడు అవుతారు. ఈ సినిమాకు అన్నీ మంచి సెంటిమెంట్స్ పడ్డాయి. మంచి హిట్టవ్వాలి" అని అన్నారు.  


ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ "సినిమాటోగ్రాఫ‌ర్‌గా అంజి 50 సినిమాలు చేశాడు. ఇప్పుడు డైరెక్షన్ అంటే నాకు కొంచెం కుళ్లుగా ఉంది. నాకు ఇంత అంత ధైర్యం రాలేదు. అంజికి అంత ధైర్యం ఉంది కాబట్టి... అతని సక్సెస్ లో మేమంతా అతని వెనుకాల ఉన్నాం. అంజిని చూస్తే... 'టెన్త్ క్లాస్ డైరీస్' తీసిన దర్శకుడిలా లేరు. బి. గోపాల్, వీవీ వినాయక్ - కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నారు. వినాయక్ అంత కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎన్నో పెద్ద సినిమాలకు చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.  


బీవీఎస్ రవి మాట్లాడుతూ "నాకు రామారావుగారు, అంజి, శ్రీనివాసరెడ్డిగారు క్లోజ్ ఫ్రెండ్స్. అవికా గోర్‌తో 'థాంక్యూ' సినిమా చేస్తున్నాను. టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నేను విజయవాడలో పదో తరగతి చదివా. నాలుగేళ్ల క్రితం మా పదో తరగతి క్లాస్‌మేట్స్‌ కలిశాం. పదో తరగతిలో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్ని చెప్పకూడనవి కూడా ఉన్నాయి" అని అన్నారు.


తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ "ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా టెన్త్ రోజులు గుర్తు వచ్చాయి. ఈ సినిమాకు కెమెరామెన్, డైరెక్టర్ ఒకరే కాబట్టి... ఆయన మనసులో ఉన్నది సినిమాలో బాగా చుపించారని అనుకుంటున్నాను. టీజర్ చూస్తే నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. సినిమా మంచి హిట్ అవ్వాలి" అని అన్నారు.  


చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ "మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సి. కళ్యాణ్ గారు, బీవీఎస్ రవి గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ఛోటా కె. ప్రసాద్ గారు... అతిథులు అందరికీ థాంక్స్. మా టెన్త్ క్లాస్‌మేట్స్ అంద‌రూ రీయూనియన్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన పాయింట్స్ తీసుకుని సినిమా చేశాం. మేం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతూ ఉందని అనుకున్నప్పుడు... మనకు సపోర్ట్ అవసరమని మేం అడగ్గానే ఏఏకే క్రియేషన్స్ నుంచి రవి కొల్లిపర సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు అజయ్ మైసూర్ కూడా మాతో జాయిన్ అయ్యారు. సినిమా విడుదలకు ముందు నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నానంటే కారణం వాళ్లే. నాకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది. తప్పకుండా హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది. కాబట్టి చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. ఆ అనుభూతులు గుర్తు వస్తాయి. అంజిగారు ఇరగదీశాడు. విజువల్ ఫీస్ట్. మేం అనుకున్న చిన్న పాయింట్‌ను ఆయ‌న బ్ర‌హ్మాండంగా తీశారు. అమెరికా, చిక్ మగళూరు, రాజమండ్రి, హైదరాబాద్... కాస్ట్లీ లొకేష‌న్స్‌లో సినిమా తీశాం. ఆడియ‌న్స్ విజువ‌ల్‌గా కూడా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్‌... సురేష్ బొబ్బిలి  చించి అవతల పడేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ చిన్న గారు చేశారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ గారు... మా కాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడ్డారు. మేం కథ అనుకున్నప్పుడు 'బాహుబలి' రైటర్ విజయ్ గారిని కలిశాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. సుకుమార్ గారి దగ్గర రైటర్ సుజీత్ డైలాగులు రాశారు. కొన్ని మోడ్రన్ సీన్స్ యాడ్ చేశారు. ఆయన ఇన్‌పుట్స్ క‌థ‌ను అందంగా మార్చాయి. అవికా గోర్, శ్రీరామ్, హిమజ, అర్చన, భానుశ్రీ... ఇలా ఆర్టిస్టులు అందరూ మాకు ఎంతో సహకరించారు. మొత్తం నలభై మంది ఆరిస్టులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్" అని అన్నారు.


'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "మా టీజర్ విడుదల చేసిన ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు. ఎస్ఆర్ మూవీ మేకర్స్ రామారావు గారు, రవితేజగారు మంచి కథతో నా దగ్గరకు వచ్చారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా నా 50వ‌ సినిమాకు నేను డైరెక్షన్ చేయాలనే డ్రీమ్ నాకు లేదు. మా నిర్మాతలకు వచ్చింది. కథ విన్నాను. సుజీత్ మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్ పూడి, ఇతరులు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రామారావుగారు చెప్పినట్టు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం పెరిగింది. ఆయనకు మద్దతుగా రవి, అజయ్ మైసూర్ వచ్చారు. '96', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'కొత్త బంగారు లోకం' కోవలో 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా  ఉంటుంది" అని అన్నారు. 


అవికా గోర్ మాట్లాడుతూ "నా టెన్త్ క్లాస్ నాకు ఎంతో స్పెషల్. పదో తరగతిలో ఉన్నప్పుడు 'ఉయ్యాలా జంపాలా' చేశా. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారు. అందువల్ల, పదో తరగతి నాకెప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా చూసి మీరంతా ఎలా ఉందో చెబుతారని ఆశిస్తున్నాను. నన్ను బబ్లీ, చబ్బీ రోల్స్‌లో చూశారు. ఈ రోల్ చాలా డిఫరెంట్ " అని అన్నారు.  


హిమజ మాట్లాడుతూ "టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికీ బోలెడు మెమరీస్ ఉంటాయి. పదో తరగతిలో ఉండగా... దసరాకు నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అతని పేరు చెప్పను. ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా! టెన్త్ క్లాస్ నేపథ్యంలో తెరకెక్కిన మంచి సినిమాలో నేను కూడా నటించడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు మా నిర్మాత అచ్యుత రామారావుగారిని చూసి షాక్ అయ్యా. మామూలుగా షూటింగ్ క్యాన్సిల్ అయితే నిర్మాతలు టెన్షన్ పడతారు. ఆయన బాంబు పడినా కూల్ గా చెబుతారు. అంజిగారు కెమెరా వర్క్ చూసుకుంటూ డైరెక్షన్ బాగా చేశారు" అని అన్నారు. 


శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ "నిర్మాత అచ్యుత రామారావుగారు సినిమాకు కథ అందించారు. నాకు కథ చెప్పినప్పుడు రొమాన్స్ ఉంది. చాలా ఊహించుకున్నాను. నాకు జోడీగా ఎవరు నటిస్తున్నారని అడిగా. చైల్డ్ ఎపిసోడ్ డ్‌లో జోడీ ఉంటుంది. మీరు వ‌చ్చేస‌రికి ఉండ‌దని చెప్పారు. క్లైమాక్స్‌లో అవికా గోర్‌ నటన చూస్తే... థియేటర్లలో క్లాప్స్ పడతాయి. స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. ఆవిడ అంత బాగా నటించారు. శ్రీరామ్ బాగా చేశారు. దర్శకుడిగా అంజికి తొలి చిత్రమైనా బాగా చేశారు" అని చెప్పారు. 


నేపథ్య సంగీత దర్శకుడు చిన్నా, రైటర్ సుజీత్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వైబ్రెంట్ మీడియా శివ - శ్రీను, ప్రభాస్ మేనేజర్ ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


'టెన్త్ క్లాస్ డైరీస్' 

తారాగణం: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, 'తాగుబోతు' రమేష్, 'చిత్రం' శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), 'జెమినీ' సురేష్, 'ఓ మై గాడ్' నిత్య, రాహుల్, 'కంచెరపాలెం' కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి


సాంకేతిక నిపుణుల వివరాలు:

కథ : రామారావు, స్క్రీన్ ప్లే - డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, సమర్పణ: అజయ్ మైసూర్, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : 'గరుడవేగ' అంజి.


Share this article :