Home » » Dharmasthali Releasing on February 4th

Dharmasthali Releasing on February 4th

ఫిబ్రవరి 4న విడుదల కానున్న ష‌క‌ల‌క శంక‌ర్ 'ధ‌ర్మ‌స్థ‌లి' చిత్రం..



కామెడియ‌న్‌గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే సోషల్ మెసేజ్ ఇస్తున్నాడు దర్శకుడు. అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ధర్మస్థలి.


ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. 'ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర‌పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్ కి జోడి గాద పావ‌ని న‌టిస్తున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము..' అని తెలిపారు.


న‌టీన‌టులు:


శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హ‌సిని, ర‌మ్య‌,స్వాతి త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:


స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు.. ర‌మ‌ణ మోగిలి

బ్యానర్: రొచిశ్రీ మూవీస్ 

నిర్మాత‌.. Mr రావు

మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌

స్టోరి, స్క్రీన్‌ప్లే, మాట‌లు- రాజేంద్ర భ‌రధ్వాజ్‌

కెమెరా.. జి ఎల్ బాబు

ఎడిట‌ర్.. వి.నాగిరెడ్డి

విఎఫ్ఎక్స్‌.. అనంత్ ఇయ్యిని

ఫైట్స్‌.. మ‌ల్లేష్‌

డాన్స్‌..చంద్ర కిర‌ణ్‌

ఆర్ట్‌.. సాంబ‌

లిరిక్స్‌.. గోసాల రాంబాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.. అకుతోట సంజు

PRO.. ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్‌


Share this article :