Athadu Ame Priyudu Pre Release Event Held Grandly

 యండమూరి వీరేంద్రనాధ్ 

"అతడు ఆమె ప్రియుడు"కు

అద్భుత విజయం తధ్యం!!

-ప్రి-రిలీజ్ వేడుకలో అతిథులు



# ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు!!


     ప్రఖ్యాత రచయిత 

యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా 

దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. 

     నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, రచనా సంచలనం విజయేంద్రప్రసాద్, దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. 

     "అతడు ఆమె ప్రియుడు" చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

     ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

Post a Comment

Previous Post Next Post