Aadhya Regular Shooting From January 11th

 జ‌న‌వ‌రి 11నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో `ఆద్య` చిత్రం



వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ త‌దిత‌రులు న‌టించ‌నున్న చిత్రం `ఆద్య‌`. శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), S.రజినీకాంత్. నిర్మాతలుగా శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద రూపొంద‌బోతోంది. DSK SCREEN సమర్పణలో, M. R. Krishna Mamidala దర్శకత్వం వ‌హిస్తున్న‌ చిత్రం ఆద్య.. జ‌న‌వ‌రి 11 నుంచి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.


శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ మీద శ్రీ బాబ్జి నిర్మించిన తొలి చిత్రం `షికారు`. త్వరలో విడుదలకు ముస్తాబు అవుతోంది. షికారు  తరువాత శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ మీద శ్రీ బాబ్జి నిర్మిస్తున్న ద్వితీయ‌ చిత్రం`ఆద్య.  ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.


నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బ పటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా, సూర్య తదితరులు


సాంకేతిక వ‌ర్గం-

బేన‌ర్‌- శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్

స‌మ‌ర్ప‌ణ- డి.ఎస్‌.కె. స్క్రీన్స్‌

నిర్మాత‌లు-  P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), S.రజినీకాంత్

క‌థ‌, స్క్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం- M.R. కృష్ణ మామిడాల,

సహ నిర్మాత: పి. సాయి పవన్ కుమార్

కెమెరా- డి. సివేంద్ర‌

ఫైట్స్‌- రామ్ ల‌క్ష్మ‌ణ్‌

పిఆర్ఓ:  వంశీ శేఖర్

Post a Comment

Previous Post Next Post