Siva Shankar Master Passed away

 ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత




కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్ ఉన్నారు. గత వారం కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 75 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించింది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పరిశ్రమలో కొందరు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి 3 లక్షల రూపాయలు తమిళ హీరో ధనుష్ 5 లక్షల రూపాయల అందించగా, సోనూ సూద్ అలాగే మంచు విష్ణు అండగా నిలబడ్డారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా శివ శంకర్ మాస్టర్ ను కాపాడలేకపోయారు.



10 భాషల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు  శివశంకర్ మాస్టర్. వీటిలో తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ దక్కింది. బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో ఆట జూనియర్స్, ఢీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు

Post a Comment

Previous Post Next Post