Maanas Nagulapalli Ksheera Saagara Madhanam in Second Place on Amazon

 బిగ్ బాస్ పార్టిసిపెంట్

'మానస్ నాగులపల్లి' నటించిన

"క్షీరసాగర మథనం" చిత్రానికి

అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం!!



     "బిగ్ బాస్" ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన "క్షీర సాగర మథనం" చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,... అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా... 

యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై... కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న "అమెజాన్ ప్రైమ్"లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.

      తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్ లో 499వ చిత్రంగా విడుదలైన "క్షీరసాగర మథనం" చిత్రం "టక్ జగదీష్" తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు!!

Post a Comment

Previous Post Next Post