Home » » Singer Mano Interview About Crazy Uncles

Singer Mano Interview About Crazy Uncles

 ‘క్రేజీ అంకుల్స్‌’.. ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌లో మెప్పిస్తాను:  సింగ‌ర్ మ‌నోయాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌లో ఓ పాత్ర‌ను చేసిన సింగ‌ర్ మ‌నో ఇంట‌ర్వ్యూ విశేషాలు...


- క్రేజీ అంకుల్స్ ఫ‌న్నీగా.. అంద‌రికీ ఆనందాన్నిచ్చే క్రేజీ సినిమా. యాబై ఏళ్లు దాటిన ముగ్గురు ఫ్రెండ్స్ క‌థ ఇది.

- ఇందులో బంగారు షాపు య‌జ‌మాని పాత్ర చేశాను. మిగ‌తా ఇద్ద‌రు(రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌ణి కంటే) స‌ర‌దాగా ఉండే పాత్ర‌. స్వ‌త‌హాగా కూడా.. నేను జోవియ‌ల్‌గానే ఉంటాను.

- ప్ర‌తిదీ న‌మ్మ‌కమే. ప్రేక్ష‌క దేవుళ్లు థియేట‌ర్స్‌కు వ‌చ్చి ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతోనే సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం.

- యాబై ఏళ్లు దాటిన ముగ్గురు ఫ్రెండ్స్ ఇళ్ల‌లో త‌మ‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫీల్ అవుతుంటారు. ఆ స‌మ‌యంలో వారికొక టీవీల్లో లేడీ సింగ‌ర్ ప‌రిచ‌యం అవుతుంది. ఆ అమ్మాయికి ముగ్గురు ఎలా ఆక‌ర్షితుల‌వుతారు. దాని వ‌ల్ల వాళ్ల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లేంటి?  చివ‌ర‌కు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తార‌నేదే క‌థ‌.

- ఇప్ప‌టి యంగ‌ర్ జ‌న‌రేష‌న్ కూడా చూడాల్సిన చిత్ర‌మే. ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఏళ్లున్న వాళ్లు మ‌రో ఇర‌వై ఏళ్ల త‌ర్వాత యాబై ఏళ్ల‌కు చేరుకుంటారు. అప్పుడెలా ఉండాలి. లేనిపోని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటే కుటుంబం ఎలా ఇబ్బందులు ప‌డుతుంద‌నే విష‌యాల‌పై ఓ అవ‌గాహ‌న క‌లుగుతుంది.

- రెండు, మూడు సినిమాల్లో న‌టించే అవ‌కాశం వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ఆలోచిస్తాను.

- ఇది వ‌ర‌క‌టికంటే గాయకుడిగా తక్కువ పాటలు పాడుతున్నా. ట్రెండ్ మారడం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగు ఐదు భాషల్లో పాడడం వల్ల ఇప్పటికీ నాకు పాటలు వస్తున్నాయి. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ అంతా దాదాపు ఒకేచోట కేంద్రీకృత‌మై ఉండ‌టం వ‌ల్ల సింగ‌ర్స్ అంద‌రికీ అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇప్పుడు అలా లేదు.

- 13 భాష‌ల్లో 25 వేల పాట‌లు పాడాను. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌లో మ‌రో 25వేల పాట‌లు పాడాను.

- ప్ర‌తి సింగ‌ర్‌లోనూ ఓ ఆర్టిస్ట్ ఉంటాడు. పాట పాడేట‌ప్పుడు హీరోను ఊహించుకుంటూ ఆ వాయిస్‌లో పాట పాడ‌తాం. అప్పుడే సిట్యువేష‌న్‌కు త‌గిన‌ట్లు పాట పండుద్ది. అలా చేసే ప్ర‌తి సింగ‌ర్‌లోనూ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ ఆర్టిస్ట్‌కు ఇలాంటి అవ‌కాశాలు ద‌క్కిన‌ప్పుడు ఎలివేట్ అవుతాడు.

- భ‌విష్య‌త్తులో కామెడీ ప్ర‌ధానంగా ఉండే పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తాను.

- రంగూన్ రౌడీలో చిన్న‌ప్ప‌టి కృష్ణంరాజు, నీడ‌లో ర‌మేశ్‌, మ‌హేశ్‌గారితో వ‌ర్క్ చేశాను. కేటుగాడులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశాను. దాస‌రిగారు ఓ ఆడ‌ది ఓ మ‌గాడు సినిమాలో  న‌న్ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌యం చేశారు.

- న‌టుడిగా అన్నీ త‌ర‌హా పాత్ర‌లు చేయాల‌ని ఉంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.Share this article :