Tremendous Response for Bhagat Singh Nagar First Look

 


జులై 12వ తేది విడుదల అయిన "భగత్ సింగ్ నగర్" (తెలుగు & తమిళ్) చిత్రంను ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన 


గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై "భగత్ సింగ్ నగర్" చిత్రంను విదార్థ్ మరియు ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించారు, ఈ సినిమా ఫస్ట్ లుక్ కు  లభించిన స్పందనపై నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ తెలుగు తమిళ ప్రేక్షకులకు మా సినిమాను అభినందించిన సినీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసారు. మీ ఆదరణతో మేము మరింత బలంగా వినూత్న ప్రొమోషన్లతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తామని తెలియజేసారు...   


భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ... కదా పరంగా సినిమాను ఆంధ్ర మరియు తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని కీలక ఘట్టాలను కేరళ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము అని తెలియజేసారు. మా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ని ఆదరించినట్టు మా సినిమాను కూడా ఆదరిస్తారని మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను. త్వరలో మీ ముందుకు భగత్ సింగ్ నగర్ టీజర్ తో వస్తామని తెలియజేసారు.   



నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


సాంకేతిక నిపుణులు : ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, స్టిల్స్ : మునిచంద్ర, నృత్యం : ప్రేమ్-గోపి, నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,  ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

 కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

Post a Comment

Previous Post Next Post