లైటింగ్ సూరిబాబుకి జోడిగా సోడాల శ్రీదేవి - సుదీర్ బాబు, 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్, కరుణకుమార్ - శ్రీదేవి సోడాసెంటర్ లో హీరోయిన్ గా ఆనంది
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సుధీర్ బాబు కి ప్రత్యేకత వుంది. ప్రేమకథాచిత్రమ్ లాంటి హర్రర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండస్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భలేమంచి రోజు లాంటి విభిన్నమైన కథనం తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. నన్నుదోచుకుందువటే, సమ్మొహనం చిత్రాల తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నారు. కథల విషయంలో కంగారు లేకుండా ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్టయ్యింది. విడుదలయ్యిన మెదటి లుక్ కి, ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ కి, తాజాగా విడుదల చేసిన మందులోడా పాటకి విపరీతమైన క్రేజ్ రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీదేవిసోడాసెంటర్ లో సుదీర్ బాబుకి జోడిగా తెలుగమ్మాయి ఆనంది నటిస్తుందనే విషయాన్ని ప్రకటిస్తూనే ఆనంది ఈ సినిమాలో పోషించిన సోడాల శ్రీదేవి పాత్రకి సంబంధించిన వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఆనంది మరో వైవిధ్యమైన పాత్రతో శ్రీదేవిసోడా సెంటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుందనే విషయం ఈ వీడియో గ్లిమ్స్ తెలియజేస్తోంది. ఆనంది అభినయం, కరుణకుమార్ డైరెక్షన్ స్కిల్స్, పంచ్ డైలాగ్స్, 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ వెరసి సోడాల శ్రీదేవి క్యారెక్టర్ వీడియో గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భలేమంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి బ్లాక్‌బస్టర్ హ్యట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 పలాస చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది.
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం – కరుణకుమార్
సంగీతం – మణిశర్మ
సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – రామకృష్ణ, మౌనిక
కథ – నాగేంద్ర కాశీ
కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, బొబ్బిలి రాజా(నిఖిల్), రియల్ సతీష్
లిరిక్స్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్
సౌండ్ డిసైనర్ – సింక్ సినిమా
ఆడియోగ్రఫి – కన్నన్ గన్పత్
పబ్లిసిటీ డిసైనర్ – అనంత్ (పద్మశ్రీ ఆర్ట్స్)
పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
Post a Comment