Home » » Jetti Titled Logo Launched in 4 Languages

Jetti Titled Logo Launched in 4 Languages

 


నాలుగు భాష‌ల్లో  జెట్టి  టైటిల్ లోగో  లాంఛ్ 


వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా  సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక  ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన  మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా   త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది . ఈ  మూవీ టైటిల్ లోగో లాంఛ్ చేసింది టీం. తెలుగు ,తమిళ్, మ‌ళ‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో టైటిల్ లోగో ని విడుద‌ల చేసారు చిత్ర యూనిట్.  దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ,  నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.  మత్స్యకారుల నేపథ్యం లో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తున్న చిత్రంజెట్టి నిలుస్తుంది.  ప్రపంచీక‌ర‌ణ తో మారుతున్న జీవ‌న‌శైలి లో తాము న‌మ్ముకున్న స‌ముద్రం మీద ఆధార ప‌డుతూ అల‌లతో పోటీ ప‌డ‌తూ పొట్ట బోసుకుంటున్న జీవితాల‌ను  అంతేస‌హాజంగా తెర‌మీద ప‌రిచాడు ద‌ర్శ‌కుడు .  అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్, అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం “జెట్టి”.  నంద‌త శ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో  కృష్ణ   హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 



 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక  మాట్లాడుతూః

ఈ క‌థ మ‌నుషుల జీవితాల్లోంచి పుట్టింది.  ప్ర‌పంచం ఎంత మారినా కొన్ని జీవితాలు అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవ‌నం సాగిస్తున్నాయి. అలాంటి ఒక ఊరిలో జరిగిన క‌థ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్ష‌ణ భార‌త‌దేశంలో నిర్మించ‌ని క‌థ ఇది. తెలుగుతో పాటు, క‌న్న‌డ‌, త‌మిళ మ‌రియు మ‌ళ‌యాణంలో రిలీజ్ చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాం.   కొన్ని వందల గ్రామాలు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు  కొన్ని త‌రాల పోరాటం, వారి క‌ల ఒక గోడ,   ఆ గోడ పేరే జెట్టి. ఈ అంశాన్ని  ప్రధానంశంగా తీసుకుని, దీనితో పాటు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అరుదయిన జాతి... సముద్రాన్ని నమ్ముకుంటూ, కడలికి కన్నబిడ్డలాగా, సముద్రానికి దగ్గరగా బతుకుతున్న జాతి "మత్స్యకారులు" వీళ్ళ జీవన శైలిని వారి కఠినమయిన కట్టుబాట్లని చూపిస్తూ తెరకెకించిన ప్రతిష్టాత్మక చిత్రం "జెట్టిష‌.  ఈ సినిమాలో సిద్ శ్రీరాం పాట హైలెట్ గా నిలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను విడుద‌ల చేస్తాం .. అన్నారు..

 



బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్

మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌

డిఓపి:  వీర‌మ‌ణి

ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి

ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌

స్టంట్స్: దేవరాజ్ నునె

కోరియోగ్రాఫర్ : అనీష్

పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్

డైలాగ్స్ ః శ‌శిధ‌ర్ 

పిఆర్ ఓ : జియస్ కె మీడియా


నిర్మాత ః వేణు మాధ‌వ్ 

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక


నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు


Share this article :