Kadha Kanchiki Manam Intiki Releasing on June 11th

 


జూన్ 11న ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ ‘కథ కంచికి మనం ఇంటికి’ విడుదల.. 


ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న తెరకెక్కిస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. తాజాగా కథ కంచికి మనం ఇంటికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరాలియో సంగీతం అందిస్తున్నారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. జూన్ 11న కథ కంచికి మనం ఇంటికి సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. 


నటీనటులు: ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ


టెక్నికల్ టీం:

దర్శకుడు: చాణక్య చిన్న

నిర్మాత: మోనిష్ పత్తిపాటి

బ్యానర్: ఎంపి ఆర్ట్స్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రఫీ: వైఎస్ కృష్ణ

సంగీతం: భీమ్స్ సిసిరాలియో

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Post a Comment

Previous Post Next Post