తెలుగు, తమిళ భాషల్లో “కాళిచరణ్”
శ్రీ కరుణాలయం ప్రోడక్షన్స్ పతాకంపై చైతన్య కృష్ణ, చాందిని జంటగా బేబి
మనస్విని సమర్పణలో శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న కాళిచరణ్ చిత్రం
తెలుగు పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని తమిళ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు
సిద్ధముతుంది.
వచ్చే నెలలో తమిళ ఆడియోని విడుదల చేసి అదే నెలలో తెలుగు, తమిళంలో ఒకే సారి ఈ
చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయని దర్శక నిర్మాత శ్రీ ప్రవీణ్
తెలియజేసారు. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం : పంకజ్ కేశరి, కవితా శ్రీనివాసన్, నాగినీడు,
రావురమేష్, సంజయ్ షేర్ తదితరులు, సినిమాటోగ్రఫి : విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్యాల.
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మ్యూజిక్ : నందన్ రాజ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : m.n.s.
రాయుడు