Home » , , » Moods of Anaika Satya Movie -Telugucinemas.in

Moods of Anaika Satya Movie -Telugucinemas.in






నా బ్యాగ్రౌండ్
హాయ్ నా పేరు అనైక నాకు 19 ఏళ్ళు. Lucknow లో పుట్టి, Hongkong లో పెరిగి, Panchgani (Mahabaleshwar), Kuala lumpur (Malaysia) లో studies చేశాను. Fashion designing course ఒక సంవత్సరం పాటు చేసి, అట్నుంచి business management course లో చేరాను... అదే టైమ్ లో మా నాన్న గారి construction business లోకి ఎంటరయ్యాను. Construction business లో నా ఇంట్రెస్ట్ కి కారణం... Cement, steel, concrete లాంటి ఎన్నో మెటీరియల్స్ తో కలిసి ఒక బిల్డింగ్ తయారయ్యే ప్రాసెస్ ని చూడ్డం చాలా బ్యూటిఫుల్ experience అని నా ఫీలింగ్.

ఒక రోజు నా ఫ్రెండ్ తో కలిసి, ఇంకో ఫ్రెండ్ ని meet అవ్వడానికి వెళ్ళి, building lift లో ఎక్కడో చూసినట్టుగా అనిపించిన ఒక వ్యక్తిని, చూశాను. లిఫ్ట్ నుంచి బయటకొచ్చాక నా ఫ్రెండ్ “తను ఆర్.జి.వి” అని చెప్పడంతో “ఆర్.జి.వి ఎవరు?” అని అడిగా... Celebrities ని ఫాలో అవ్వకపోవడం వల్ల అడిగిన ప్రశ్న అది. వెంటనే నా ఫ్రెండ్ ఆర్.జి.వి అంటే రామ్‌గోపాల్ వర్మ, ఫిల్మ్ మేకర్ అని కొన్ని సినిమాల పేర్లు చెప్పడంతో అందులో నేను చూసిన, లైక్ చేసిన కొన్ని సినిమాలు నాకు గుర్తొచ్చాయ్...

ఆ తర్వాత కొద్ది సేపటికి నా ఫ్రెండ్ “తను అదే బిల్డింగ్ లో ఉన్న సందీప్ చౌతాని కలవడానికి వెళ్తున్నాడని చెప్పడంతో నేను “సందీప్ చౌతా ఎవరని?” అడిగా... తను “music director” అని చెప్పాడు. ఆ తర్వాత నేను, నా వేరే ఫ్రెండ్ సినిమాకెళ్ళాం... అనుకోకుండా ఆ సినిమా ఆర్.జి.వి సినిమానే అయ్యింది, కాని ఆ సినిమా నాకు నచ్చలేదు. తరువాతి రోజు నా ఫ్రెండ్ ఫోన్ చేసి “RGV నిన్ను కలవాలంటున్నాడు” “సందీప్ చౌతా అపార్ట్మెంట్ కి వెళితే అక్కడున్న ఆర్.జివి, నా ఫ్రెండ్ ని గుర్తుపట్టి “నీతో లిఫ్ట్ లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు...?” అని అడిగాడని, తను “తన పేరు అనైక, తన ఫాదర్ ది construction business” అని నా ఫ్రెండ్ చెప్పడంతో ఆర్.జి.వి “ఒక సినిమా గురించి ఆ అమ్మాయిని కలవాలి” అని చెప్పారంట.
నాకున్న Curiosity కి తోడు, నా ఫ్రెండ్ కూడా బలవంతం చెయ్యడంతో ఆర్.జి.వి ని కలవడానికి ఆఫీస్ కెళ్ళా... తను “నీ పేరేంటి?” అని అడిగితే, “అనైక” అని చెప్పా. “నేనడుగుతోంది నీ పూర్తి పేరు?” “అదే నా పూర్తి పేరు, అనైక” అని చెప్పాను. తను కొద్ది సేపు అలాగే నన్ను గమనిస్తూ “ఆ రోజు లిఫ్ట్ లో నిన్ను చూసినపుడు నువ్వు ఫోటోజెనిక్ గా ఉంటావు అనిపించింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చాలా ఫోటోజెనిక్ గా ఉంటావు” అని తను చెప్తుంటే అర్థం కాక blank face పెట్టిన నన్ను చూసి “టెక్నికల్ గా మేము దాన్ని screen presence అంటాం... నేను చేయబోతున్న హిందీ, తెలుగు, తమిళ సినిమా “సత్య” లో నిన్ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాను” అని చెప్పడంతో నేను “నాకు నటించటం రాదు, నటించాలన్న  interest కూడా లేదు” అని చెప్పాను... తను “నీ కళ్ళని చూస్తే ఖచ్చితంగా నువ్వు అద్భుతమైన నటివవుతావని నాకనిపిస్తోంది, ఇక acting interest లేదన్న మాటకొస్తే “ముందు కథ విను” అని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు.
విన్న తరువాత “నాకు చాలా నచ్చింది, కానీ...” అనగానే తను “ఇప్పుడు చెప్పొద్దు, ఒక రోజంతా ఆలోచించుకుని చెప్పు” అంటూ నా ఆన్సర్ ని కట్ చేశారు.

జరిగిందంతా నేను నా ఒక క్లోజ్ ఫ్రెండ్ కి చెపితే తను “ఒక సినిమా ట్రై చేసి చూడు” అని సలహా ఇచ్చాడు... నేను ఆర్.జి.వి ని కలిసి “ఈ సినిమా చేద్దామనుకుంటున్నాను, కాని నా ఆక్టింగ్ సంగతేంటి?” అని అంటే  తను “నువ్వు నాచురల్ ఆర్టిస్ట్ వి, ట్రైనింగ్ నీలో నాచురల్ గా ఉన్న ఆక్టింగ్ స్కిల్స్ ని పాడు చేస్తుంది” అన్నారు.

అలా ఏం ట్రైనింగ్ లేకుండా మూవీ కెమెరా ముందు కొచ్చి, ఫస్ట్ టైమ్ “సత్య” సినిమాలోని “ఏవేవో పిచ్చి ఊహలే” అన్న పాట షూటింగ్ స్టార్ట్ చేశాను. మొట్టమొదటి షాట్ నుంచి నేను Camera… sound… action అనే ఆ మూడు beautiful words ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను... ఇంతవరకు నాకొచ్చిన best compliment ఏంటంటే మా కెమెరామన్ నాతో You love the camera and the camera loves you అని చెప్పడం.

అందుకే ఇప్పుడు నేను Cement, steel, concrete ల అందమైన ప్రపంచాన్ని వదులుకొని, అంతకన్నా అత్యంత అందమైన సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను.
ప్రేమతో...
  అనైక

Share this article :