Jr NTR Fan Died At Badshah Audio Function
'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో వరంగల్ జిల్లాకు చెంది రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన బాద్ షా సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అంచనా మించి అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో వరంగల్ ఉరుసుగుట్టకు చెందిన రాజు ఊపిరాడక మృతి చెందాడు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాత. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సంఘటన జరగడం చాల దురదృష్ట కరం అని 'బాద్ షా' యూనిట్ అభిప్రాయపడ్డారు
ఎన్టీఆర్ ఆ కుటుంభానికి ప్రగాడ సంతాపం తెలియజేసారు ఆ కుటుంబానికి అందగావుంటాను అని ప్రతిజ్ఞ కూడా చేసారు ఆయన ఏం అన్నారో అయన మాటల లో
నేను ఈ ఫంక్షన్ కి ఎంతో ఆనందం గా వచ్చా కానీ నాకు ఇప్పుడు చాల బాధ గ వుంది
నేను మా అమ్మ కి ఒకడినే కొడుకుని ఈ సంఘటన నన్ను కలచి వేసింది మీరు నాకు ఎంతో మంది తోబుట్టువులను ఇచ్చారు వారి నుంచి ఒకరు ఈ రోజు నన్ను వదిలి వెళ్లి పోయారు నాకు చాల బాధ గా వుంది నేను జీవితాంతం ఆ కుటుంబానికి అండగా వుంటాను దయ చేసి మీరు అందరు జాగ్రత్త గ వుండండి మీరే నాకు అండ
బండ్ల గణేష్ మాటలాడుతూ అమ్మ నేను మరణించిన మీ బిడ్డను తీసుకు రాలేను నాకు చాల బాధ గ వుంది రేపు ఉదయం నీ దగ్గరకి వచ్చి నేను నా వంతు ఉడత భక్తి గ 5 లక్షలు రూపాయలు మీకు అందజేస్తాను ఈ విషయం చాల బాధ గ వుంది అని అయన కంట నీరు పెట్టుకున్నారు
శ్రీను వైట్ల మాటలాడుతూ నాకు ఎంతో బాధ గ వుంది ఈ సమయం లో 'బాద్ షా' గురించి చెప్పడం సమంజసం కాదు అని భావిస్తున్న వారి కుటుంబానికి న సానుభూతిని తెలియజేస్తునా
జరిగిన ఈ సంఘటన అందరిని బాధ కు గురిచేసింది ఈ ఆడియో ఫంక్షన్ లు నిర్వహించే వారు ఎంత జాగ్రత్త వ్యవహరించిన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి గతం లో మిర్చి కూడా తొక్కిసలాట జరిగింది
ఈ సారి నుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలి అని కోరుకుంటూ ఈ సంఘటన లో మృతి చెందిన రాజు కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి అని TELUGUCINEMAS.IN మనస్పూర్తి గ ఆ భగవంతుడిని కోరుకుంటోంది