Case Registered On Baadshah Producer and Others

‘బాద్‌షా’ నిర్మాతపై కేసు నమోదు


జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న బాద్‌షా ఆడియో ఫంక్షన్‌లో ఆదివారం జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్మాత బండ్ల గణేష్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ చిత్ర నిర్మాతతో పాటుగా తదితరులపై కేసును నమోదు చేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రాజు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటాను అని అన్నారు.  ఈ కేసు ఎటు దారితీస్తుందో చూడాలి 
Previous Post Next Post