Saina Nehwal Is Huge Fan To Maheshbabuమహేష్ పై మన‘సైనా’

మిల్క్ బాయ్ హీరో మహేష్ అంటే బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు చాలా ఇష్టమట. అతని నటనన్నా...‘అతడు’ అన్న చచ్చేంత అభిమానమని తేల్చిచెబుతోంది. ఆదివారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మన‘సైన’మాట చెప్పింది. పండుగల్లో వినాయకచవితి, దీపావళి, అలాగే క్రీడల్లో బాడ్మింటన్ తోపాటు టెన్నిస్ అంటే మహా ఇష్టమట.

అదేవిధంగా హీరోలలో ఒకే ‘ఒక్కడు’ మహేష్ బాబును మరిచిపోలేనంటోంది. అతని సినిమాలు ఏదీ మిస్సుకాలేదంటోంది. నటనలో మహేష్ ‘దూకుడు’ భలేగుంటుందట. అలాగే క్రికెట్లో సచిన్ అభిమానినని తెలిపింది. కాగా ఒలంపిక్స్ జరిగే ముందు శ్రీవారిని స్మరించానని స్వర్ణంకోసం ప్రయత్నిస్తే కాంస్య పతకం దక్కిందని సైనా వివరించింది. శ్రీవారి ఆశీస్సులతో వచ్చేసారి తప్పకా స్వర్ణం సాధిస్తానని తేల్చిచెప్పింది.

Post a Comment

Previous Post Next Post