Chiranjeevi grand daughter injured

ఆసుపత్రిలో చిరంజీవి మనవరాలు
రామ్ చరణ్ వివాహం ఇక రెండు రోజుల్లో జరుగుతుండగా... చిరంజీవి ఇంట చిన్న అపశృతి చోటుచేసుకుంది. చిరంజీవి మనవరాలు (పెద్ద కూతురు సుస్మిత కూతురు) గాయాలపాలైంది. వివాహ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో 'సంగీత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ, రాజకీయప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు. ఓ పక్క సంగీత నృత్య కార్యక్రమాలతో విందు మంచి జోష్ తో జరుగుతుండగా ... అందరూ చూస్తుండగానే చిరంజీవి మనవరాలు అక్కడి భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది.
వెంటనే స్పందించిన చిరంజీవి స్వయంగా ఆ చిన్నారిని అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. గాయాలపాలైన చిన్నారిని ఐసీయూలో వుంచి చికిత్స జరుపుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. పాప పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామానికి చిరంజీవి కుటుంబంతో బాటు, ఉపాసన కుటుంబ సభ్యలు కూడా ఆందోళన చెందుతున్నారు.

Post a Comment

Previous Post Next Post