y.sjagan produceing moviewithpawankalyanపవన్ సినిమాకి జగన్ నిర్మాత ?





ఆశ్చర్యంగా వుంది కదూ.... కానీ, టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న హాట్ న్యూస్ ఇదే! ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే... కొన్నాళ్ల క్రితం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అనే చిత్రం ప్రారంభమైన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఏసుప్రభు జీవన నేపథ్యాన్నే ఈ సినిమాకి కథావస్తువుగా తీసుకున్నారు. కొండా కృష్ణంరాజు నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమాకి సంబంధించిన కొంత భాగాన్ని జెరూసలెం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో అనుష్కా కూడా ఓ ముఖ్య భూమికని పోషిస్తున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే బడ్జెట్ దాటిపోతోన్న కారణంగా నిర్మాత చేతులెత్తేయడంతో, ఈ సినిమాని అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా తిరిగి పట్టాలు ఎక్కబోతుందనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తున్నాయి. వైయస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మాణాన్ని చేబడుతున్నారనీ, అందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయనీ అంటున్నారు. ఈ ప్రచారంలో నిజానిజాల సంగతి గురించి కొందరు ఆలోచిస్తుంటే ... ఇందులోని రాజకీయ కోణాన్ని వెతికే పనిలో మరి కొందరు బిజీ అయినట్టు తెలుస్తోంది!








Post a Comment

Previous Post Next Post