వై.ఎస్.జగన్ అరెస్టు-మళ్లీ ఎప్పటికి బయటపడేనో
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మూడోరోజు విచారణ అనంతరం అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ ప్రకటించింది.గత తొమ్మిది నెలలుగా ఉత్కంఠ భరితంగా సాగిన జగన్ కేసులో ఒక కీలక దశకు చేరుకున్న తరుణంలో మూడు రోజుల విచారణ అనంతరం అరెస్టు చేశారు. ఏడు గంటల ఇరవై నిమిషాలకు అతనిని అరెస్టు చేశారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా హై డ్రామా నడిచింది.ఒకపక్క ఉప ఎన్నికల ప్రచారం నేపధ్యంలో సిబిఐ కావాలని ఇలా కేసులో ఇరికించిందని, ప్రచారం చేయనివ్వకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నదని జగన్ ఆరోపించారు. అయితే సిబిఐ జగన్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ కస్టడికి తీసుకోవచ్చు.అంతకుముందు రెండు గంటలపాటు సస్పెన్స్ ధ్రిల్లర్ మాదిరి కేసు నడిచింది. టీవీలన్నిటిలో క్షణం,క్షణం ఏమవుతుందా అన్నట్లు కధనాలు సాగాయి.చివరికి ఏడున్నర గంటలకు ఈ ఉత్కంఠకు తెరపడింది. అయితే ఒకసారి జగన్ అరెస్టు అయ్యాక ఎప్పటికి తిరిగి బయటకు వస్తారనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. కొందరు కాంగ్రెస్ నేతలు అయితే ఒకసారి జగన్ అరెస్టు అయితే బయటకు రావడం చాలా కష్టం కావచ్చని, రెండేళ్లు పట్టినా పట్టవచ్చని,ఈలోగా జగన్ పార్టీని బలహీనపరచవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతూ వచ్చారు.మరి ఆ ప్రకారం రెండేళ్ల వరకు బయటకు రాని పరిస్థితి ఉంటుందా? లేక త్వరగానే బెయిల్ వస్తుందా అన్నది చూడాలి. అయితే జగన్ అరెస్టు కావడంతో మరికొందరు మంత్రులు కూడా అరెస్టు అవుతారా? లేక మోపిదేవి వెంకట రమణరావుకే పరిమితం చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది.

kommeni artical
Post a Comment