పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా పూర్తవడంతో, ఆయన నటించే తదుపరి చిత్రం 'కెమెరా మేన్ గంగతో రాంబాబు' షూటింగుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగును ఈ నెలలోనే ప్రారంభిస్తారు. ఇదిలా ఉంచితే, ఆయన నటించే ఇతర చిత్రాల గురించిన వార్తలు కూడా మరోపక్క వినపడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లానింగ్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క శ్రీను వైట్ల దర్శకత్వంలో కూడా పవన్ కల్యాణ్ ఓ చిత్రం చేస్తారని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే రెడీ అయిందట. ప్రముఖ రచయిత కోన వెంకట్ దీనికి రచన చేసినట్టు చెబుతున్నారు. పవన్ సమయం ఇస్తే కథ వినిపించడానికి ఆయన సిద్ధంగా వున్నారు. ఈ చిత్రాన్ని కూడా బండ్ల గణేష్ నిర్మిస్తాడని అంటున్నారు. కాగా, శ్రీను వైట్ల ప్రస్తుతం యన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇది పూర్తయ్యాక పవన్ కల్యాణ్ ప్రాజక్టు చేబడతారట!
Post a Comment