allegations aganist gabbarsingh producer 'గబ్బర్ సింగ్' నిర్మాతపై ఆరోపణలు


నిర్మాతగా మారిన హాస్యనటుడు గణేష్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరు చెప్పి, గణేష్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విదేశాల్లో తెలుగు చిత్రాలు పంపిణీ చేసే ఎన్.సుబ్బారావు ఆరోపిస్తున్నారు. తన సినిమాల విదేశీ హక్కుల విషయంలో రోజుకో మాట మారుస్తూ, ఆర్ధిక లావాదేవీల్లో మోసం చేస్తున్నాడని ఆయన మీడియా సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. "గతంలో తీన్ మార్ చిత్రం విదేశీ హక్కుల కోసం 2.25 కోట్లు తీసుకుని సకాలంలో ప్రింట్లు ఇవ్వలేదు. దాని వల్ల ప్రీమియర్ షో వేయలేకపోవడంతో 48 లక్షలు నష్టపోయాను. ఇదేమని అడిగితే, తన వెనుక బొత్సా ఉన్నారనీ, రౌడీల అండ కూడా వుందని గణేష్ బెదిరించాడు. ఈ విషయంపై ఫిలిం చాంబర్ కి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు" అన్నారు సుబ్బారావు. అసలు గణేష్ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతూ, ఇన్ని భారీ సినిమాలు ఎలా తీస్తున్నాడో, ఆయన వెనుక ఎవరున్నారో సిఐడీ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, గణేష్ తాజాగా 'గబ్బర్ సింగ్' సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే!

Post a Comment

Previous Post Next Post