'అధినాయకుడు'లో డైలాగులు అభ్యంతరకరం
నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' సినిమాలోని డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రం విడుదలను నిలిపివేయాలని వారు కోరారు. రాజకీయంగా ఒక పార్టీకి అబ్ది చూకూర్చేవిధంగా ఇందులో డైలాగులు ఉన్నాయని వారు తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో వైఎస్ఆర్ సిపి నేతలు మాజీ మంత్రి మారెప్ప,మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, వెంకట ప్రసాద్ ఉన్నారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆ సినిమా ద్వారానే ఉపఎన్నికల ప్రచారమని బాలకృష్ణ ప్రకటించారన్నారు. కడప ఉపఎన్నికల్లో బాలకృష్ణ, చిరంజీవి తొడలుకొట్టినా ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పలు జరిగి వ్యక్తులు చనిపోయారు. అప్పుడేగనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాలకృష్ణ జైల్లో ఉండేవారని వారు అన్నారు
Post a Comment