MOHANBABU IN MAHESHBABU MOVIE?

 
గత కొంత కాలంగా నటనకు దూరంగా వున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు తిరిగి ఓ ప్రత్యేకపాత్రలో వెండితెరకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేటి అగ్ర నటుడు మహేష్ బాబు నటించే ఓ భారీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించడానికి ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్, కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో మోహన్ బాబు నటించనున్నారనే వార్త ఫిలిం నగర్లో గుప్పుమంది. ఇందుకు గాను ఆయనకు భారీ పారితోషికాన్ని కూడా ముట్టజెబుతున్నారట. గతంలో మోహన్ బాబు యన్టీఆర్ నటించిన 'యమదొంగ', ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' చిత్రాలలో ఇలాగే ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి మనకు తెలుసు!

Post a Comment

Previous Post Next Post