హీరో రామ్ చరణ్ తన వ్యక్తిగతానికి సంబంధించి తాజాగా ఓ కొత్త విషయాన్ని బయటపెట్టాడు. అదీ తన పేరుకు సంబంధించిన విషయం కావడం ఇక్కడ విశేషం. తన పేరు కేవలం 'రామ్ చరణ్' మాత్రమేననీ, 'రామ్ చరణ్ తేజ' కాదని చెబుతున్నాడు. అంటే అతని పేరులో 'తేజ' అన్న పదం లేదట. "మా డాడ్ నాకు పెట్టిన పేరు రామ్ చరణ్... రామ్ చరణ్ తేజ కాదు. కాబట్టి, అందరూ అసలు పేరైన రామ్ చరణ్ అని పిలిస్తేనే నాకు ఆనందం. ఇది గమనించాల్సిందిగా మీడియా వాళ్లను కూడా కోరుతున్నాను' అంటున్నాడు చరణ్. సో... ఇక నుంచి అభిమానులు, మీడియా వాళ్లు చరణ్ ని జస్ట్ 'రామ్ చరణ్' అంటూ సంబోధించడం అలవాటు చేసుకోవాలి!
రామ్ చరణ్ ఈ విషయం త్విట్టేర్ లో పెరుకొన్నారు
Post a Comment